మహేష్ బాబుపై కోర్టులో కేసు

శ్రీమంతుడు కథ కాపి వివాదం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.మీకు గుర్తు ఉండే ఉంటుంది, సినిమా విడుదలైన కొన్నిరోజులకు శరత్ చంద్ర అనే రచయిత శ్రీమంతుడు కథని 2012 లో పబ్లిష్ అయిన తన నవల “చచ్చేంత ప్రేమ” నుంచి కాపి కొట్టారని అరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 Ipc 120b Case Filed On Mahesh Babu-TeluguStop.com

కొరటాల ఈ ఆరోపణలని అప్పట్లో ఖండించిన, మహేష్ మాత్రం స్పందించలేదు.

ఇన్నిరోజుల తరువాత ఆ రచయిత కోర్టుకెక్కాడు.

IPC 120B మరియు కాపిరైట్ చట్టం సెక్షన్ 63 కింద శ్రీమంతుడు కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ యర్నేనిల మీద కేసు నమోదయ్యింది.నాంపల్లి కోర్టు వీరి ముగ్గరికి సమన్లు జారిచేసింది.

అలాగే ఈ చిత్రం యొక్క రిమేక్ హక్కులు ఇతర భాషలవారికి ఇవ్వకుండా అడ్డుకోవాలని కూడా ఆ రచయిత కోర్టుని అభ్యర్థించాడని తెలుస్తోంది.ఇప్పుటివరకైతే ఈ కేసు మీద శ్రీమంతుడు టీమ్ స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube