ఇంటర్నెట్ లో ఉండే కొన్ని వీడియోలు చూస్తుంటే మనసు కరిగిపోతుంది.ఎందుకంటే ఆ వీడియోలు మనసును హత్తుకునేంత హృద్యంగా ఉంటాయి.
తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో 86 ఏళ్ల మహిళ తాను గెలుచుకున్న లాటరీ టికెట్ లో సగం డబ్బులను లాటరీ అమ్మిన వ్యక్తికి అందించింది.
బహుమతి సినిమాలో హీరో తన మాట ప్రకారం ఒక లేడీ వెయిటర్ కు సగం డబ్బులు అందించినట్లుగా.ఈ వృద్ధురాలు కూడా అంతే డబ్బులు అందించి తన గొప్ప మనసు చాటుకుంది.
దీనికి సంబంధించిన వీడియోని Good News Movement అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోకి ఏకంగా 40 లక్షల వ్యూస్ వచ్చాయి.
వివరాల్లోకి వెళితే.కొద్ది రోజుల క్రితం వాల్టర్ అనే ఒక స్టోర్ క్యాషియర్ మారియన్ ఫారెస్ట్ అనే వృద్ధురాలిని లాటరీ టికెట్ కొనాలని ఎంకరేజ్ చేశాడు.ఈ లాటరీ కొనుగోలు చేస్తే 50 వేల డాలర్ల జాక్ పాట్ కొట్టొచ్చని ఆమెకు వాల్టర్ వివరించాడు.అతడు బతిమిలాడుతుంటే కాదనలేక ఆమె ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.
అదే సమయంలో ఒకవేళ ఆ టికెట్ కు లాటరీ తగిలితే అందులో సగం డబ్బులు షేర్ చేస్తానని స్టోర్ క్యాషియర్ కు మాటిచ్చింది.
అయితే అనూహ్యంగా ఆమె తాజాగా లాటరీ గెలుచుకుంది.మారియన్ అదృష్టం కొద్దీ 300 డాలర్లు (సుమారు రూ.23 వేలు) లాటరీ గెలుచుకోగా ఆ చిన్న మొత్తంలో సగం డబ్బులు ఇచ్చేందుకు మళ్లీ స్టోర్ క్యాషియర్ వద్దకు వచ్చింది.రెండు బెలూన్స్ పట్టుకొని వచ్చిన ఆమె వాల్టర్ కు 150 డాలర్లు ఇచ్చింది.బెలూన్స్ పై వాల్టర్ వన్ అని రాయించి మరీ అతడికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
అయితే ఆమె తన మాటను నిలబెట్టుకుని.డబ్బులు ఇవ్వడం చూసి స్టోర్ లోని మిగతా వర్కర్లందరూ ఆశ్చర్యపోయారు.
ఆమె గొప్ప మనసుని పొగుడుతూ చప్పట్లు కొట్టారు.సో స్వీట్ ఆఫ్ యూ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.ఈ హార్ట్ టచింగ్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.