2022 ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు పేల‌వం... కోహ్లీకి ఎంతో ప్ర‌త్యేకం!

2022వ‌ సంవత్సరం భారత క్రికెట్‌కు ఏమాత్రం ప్రత్యేకమైనది కాక‌పోయిన‌ప్ప‌టికీ ఇది ఖచ్చితంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొత్తదనాన్ని అందించింది.విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయలేని పనుల‌ను ఈ ఏడాది చేశాడు.

 2022 Poor For Indian Cricket Team... Very Special For Kohli , Indian Cricket Tea-TeluguStop.com

అదే విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ టీ-20లో సెంచరీ సాధించ‌డం.విరాట్ కోహ్లీ 2010లో అంతర్జాతీయ టీ-20లో కాలుమోపాడు.

అంతకు ముందు కోహ్లీ వన్ డేలో అరంగేట్రం చేసినప్పటికీ, కోహ్లి లాంటి అద్భుత బ్యాట్స్‌మెన్ టీ-20లో ఇన్ని సంవత్సరాల పాటు ఒక్క సెంచరీ కూడా సాధించలేక‌పోవ‌డాన్ని అత‌నితో స‌హా ఎవరూ ఊహించి ఉండరు.విరాట్ కోహ్లీ కూడా 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.

వాటిలో కూడా ఎప్ప‌డు కోహ్లీ సెంచరీ చేయ లేదు.అయితే 2016లో విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేయడం గ‌మ‌నార్హం.ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన తర్వాత, విరాట్ కెరియ‌ర్ ఊపందుకుంది.2016వ‌ సంవత్సరంలోనే విరాట్ కోహ్లీ ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు సెంచరీలు సాధించాడు.

అయితే టీ-20 ఇంటర్నేషనల్‌లో అటువంటి మ్యాజిక్ చేయ‌లేదు.విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో మరో సెంచరీ సాధించాడు.అంటే కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్‌లో గత మూడేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం తహతహలాడుతున్నాడు.టీ20ని ప‌క్క‌న పెడితే వన్డేలు,టెస్టుల్లోనూ అతని బ్యాట్‌కి సెంచరీ న‌మోదు కాలేదు.కానీ ఆసియా కప్ 2022లో విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్‌పై తన తొలి సెంచరీని సాధించ‌డం అతనికి ప్రత్యేకమైనదిగా మిగిలింది.

ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి అవకాశం లభించింది.అప్పుడు విరాట్ కోహ్లీ తొలి సెంచరీ సాధించాడు.

Telugu @viratkohli, Asia Cup, India, Indian Cricket, Ishan Kishan, Kohli, Centur

ఇది చిన్న సెంచరీ ఏమీ కాదు.కోహ్లీ 122 పరుగుల పూర్తి ఇన్నింగ్స్ ఆడాడు.అది కూడా కేవలం 61 బంతుల్లోనే చేయ‌డం విశేషం.ఈ సమయంలో విరాట్ కోహ్లి బ్యాట్ నుంచి ఆరు సిక్సర్లు, 12 ఫోర్లు రాలిప‌డ్డాయి.ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 200.ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్ గెలిచింది.కానీ దీని తర్వాత కూడా భారత జట్టు ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.చాలా కాలం తర్వాత టీ20లో సెంచరీ వస్తుందని అనుకోలేదని మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా తెలియ‌జేశాడు.దీని తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేల్లో 91 బంతుల్లో 113 పరుగులు చేసిన కోహ్లీ టీ20ల్లో కాకుండా వన్డేల్లో మరో సెంచరీ చేశాడు.

ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన మ్యాచ్ ఇదే అని అంద‌రికీ గుర్తుండిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube