బస్ పాస్ ల పై 20 శాతం రాయితీ:- నిరుద్యోగులకు టి.ఎస్‌.ఆర్టీసీ గుడ్ న్యూస్‌

నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది, అందులో భాగంగా పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న నిరుద్యోగుల కోసం టి ఎస్ ఆర్టీసీ సంస్థ ఓ చ‌క్క‌టి శుభ‌వార్త‌ను అందించింది.టి ఎస్‌ ఆర్టీసీ సంస్థ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో మ‌రో మారు కీల‌క నిర్ణ‌యంతో ముందుకొచ్చింది.

 20% Discount On Bus Passestsrtc Good News For The Unemployed , Minister Puvada A-TeluguStop.com

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆర్డిన‌రీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ బ‌స్ పాస్‌ల‌పై 20శాతం రాయితీని కల్పిస్తు నిర్ణయం తీసుకుంది.

ఈ సంద‌ర్భంగా టి.

ఎస్‌.ఆర్టీసీ ఛైర్మ‌న్ శ్రీ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌ గారు, సంస్థ వి.

సి అండ్ ఎం.డి శ్రీ వి.సి.స‌జ్జ‌నార్‌ గారు మాట్లాడుతూ పేద అభ్య‌ర్థుల‌కు చేయూత‌ను అందించాల‌నే ఉద్ధేశంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంచి ఆలోచన చేశారని వివరించారు.సిటీ ఆర్డిన‌రీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బ‌స్ పాస్‌ల‌పై మూడు నెలలకు 20 శాతం రాయితీ ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించారు.ఈ ప్ర‌త్యేక ఆఫ‌ర్ మూడు నెల‌ల పాటు అందించ‌నున్న‌ట్లు చెబుతూ, బస్ పాస్ పొందడానికి దరఖాస్తు తో పాటు ఆధార్ కార్డు, కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు లేదా ప్ర‌భుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుందని వివ‌రించారు.

సిటీ ఆర్డిన‌రీ రూ.3450, ఎక్స్‌ప్రెస్ రూ.3900 ఉండ‌గా పోటీ అభ్య‌ర్థుల‌కు 20 శాతం రాయితీ క‌ల్పించిన త‌రువాత వ‌రుస‌గా రూ.2800, రూ.3200 ఛార్జీలు ఉంటాయిని తెలిపారు.ఈ రాయితీ మొద‌టి సంద‌ర్భంలో 6 నెల‌ల పాటు కొన‌సాగుతుంద‌ని, శిక్షణ / కోచింగ్ తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం అని పేర్కొన్నారు.

అన్ని బ‌స్ పాస్ కౌంట‌ర్ల‌లలోనూ నిరుద్యోగులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube