మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని అంటున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడు..!!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పై సీరియస్ అయ్యారు.

 Tdp Leader Acheyanaidu Sensational Comments On Minister Botsa Satyanarayana, Td-TeluguStop.com

రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో వరుసగా ప్రశ్న పత్రాల పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో.విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ప్రశ్నాపత్రాల లీకేజీ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు కర్నూల్, శ్రీ కాకులం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి.కర్నూలులో జరిగిన ఘటనకు సంబంధించి కొంతమంది ని సస్పెండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది.

అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చినట్లూ పేర్కొంటున్నారు.మరి ఇటువంటి తరుణంలో అచ్చెన్నాయుడు కామెంట్లపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube