బహుజనులు పాలకులైతేనే.. పేదల బతుకులు మారుతాయి:- డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

తరతారాలుగా ఆధిపత్య పార్టీలు బహుజనులను ఎన్నికల్లో ఓట్లేసే యంత్రాలుగా మార్చాయి తప్ప,రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదని బహుజనులు పాలకులైతేనే పేదల బతుకులు మారుతాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర 46వ రోజు కొనసాగింది.

 If The Masses Are The Rulers .. The Lives Of The Poor Will Change: - Dr. Rs Prav-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

గత ఏడేళ్లుగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బుట్టదాఖలు చేసిన కేసీఆర్ దళిత బంధు పథకంతో మరోసారి మోసానికి తెరతీశారన్నారు.ప్రాజెక్టుల పేరుతో నిరుపేద రైతులను బెదిరించి, నిరుపేదలకు చెందిన 32 వేల ఎకరాల అసైండ్ భూములను  బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు.

పోడు భూములకు పట్టాలు,కొత్త పింఛన్ల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

లక్షల కోట్ల ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో ఆధిపత్య వర్గాలకే టెండర్లు దక్కుతున్నాయని ఆరోపించారు.

లక్షల కోట్ల ప్రజా సంపద ఎవరి జేబుల్లోకి పోతుందో ప్రజలకు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టెండర్ల ప్రక్రియలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం చేపట్టిన గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు చుక్క తాగు నీరు అందడం లేదని అన్నారు.పేద విద్యార్థులు చదివే పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు, కానీ రాజకీయ నాయకుల పిల్లలు చదివే పాఠశాలల్లో మాత్రం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతోందని ఆరోపించారు.

తరతరాలుగా ఆధిపత్యవర్గాలు వంశపారంపర్యంగా రాజకీయాలు చేస్తున్నారని తెలిసిన ఆయన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించాలన్నారు.వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube