ఈరోజు ఉదయం గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై జి కొత్తపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు.
దీంతో ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యే.రాగా అక్కడ గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎమ్మెల్యేపై తిరగబడ్డారు.
కొంతమంది చేయి చేసుకోవడానికి కూడా మీదకి వెళ్ళారు.ఈ క్రమంలో పోలీసులు అడ్డుపడినా గాని గ్రామస్తులు తీవ్ర ఆవేశాలతో ఎమ్మెల్యే తలారి పై దాడికి పాల్పడటం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తనపై దాడికి సంబంధించి మీడియాతో మాట్లాడారు.వైసిపి పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ హత్యకు గురికావడంతో అక్కడికి వెళ్ళవలసి వచ్చిందని తెలిపారు.
అయితే కొత్త వ్యక్తులతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారని.పోలీసులు సంరక్షణ గా పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ లోకి తీసుకెలడం జరిగిందని తెలిపారు.
మరి ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయి అనేది పోలీసులే తేల్చాలని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే మరో పక్క మృతుడు గంజి ప్రసాద్ భార్య తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావే కారణమని ఆరోపిస్తోంది.