యూజర్ల కోసం వాట్సాప్‌లో 10 కొత్త ఫీచర్లు.. వాటి వివరాలివే

వాట్సాప్‌ను( Whatsapp ) ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు.దీని వల్ల మెటాకు పెద్దగా ఆదాయం లేదు.

 10 New Features In Whatsapp For Users Their Details , 10 New Features , Technolo-TeluguStop.com

అయితే సంస్థ అధీనంలోని ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రకటనల ద్వారా చాలా ఆదాయం వస్తోంది.ఈ క్రమంలో వాట్సాప్ బిజినెస్‌తో మరింత ఆదాయాన్ని ఆర్జించేందుకు మెటా సిద్ధమవుతోంది.ఇప్పటి వరకు 2023లో, కంపెనీ చాట్ యాప్‌లో అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది.2023లో వాట్సాప్‌లో రానున్న టాప్-10 ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Telugu Whatsapp, Latest, Ups-Latest News - Telugu

వాయిస్ స్టేటస్:( Voice Status ) మీరు మీ ఆలోచనలను మీ స్నేహితులతో పంచుకోవాలనుకుంటే, టైపింగ్ ఇబ్బందిని నివారించాలనుకుంటే, కొత్త వాయిస్ స్టేటస్ ఫీచర్ ఉపయోగపడుతుంది.వాయిస్ స్టేటస్ ఫీచర్ ద్వారా, యూజర్లు వారి వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు.వాటిని పోస్ట్ చేయవచ్చు.ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగానే ఈ వాయిస్ స్టేటస్ కూడా 24 గంటల పాటు కొనసాగుతుంది.దీని కోసం, స్టేటస్ ట్యాబ్‌కి వెళ్లి, ఆపై పెన్సిల్ చిహ్నంపై నొక్కండి.దీని తర్వాత మైక్ చిహ్నాన్ని నొక్కి పట్టుకోండి.

Telugu Whatsapp, Latest, Ups-Latest News - Telugu

చాట్‌లో పిన్ మెసేజెస్:( Pin messages in chat ) వాట్సాప్‌లోని అనేక మెసేజ్‌లలో చాలా సార్లు ముఖ్యమైన చాట్‌లు పోతాయి.మళ్లీ అవసరమైనప్పుడు, ఈ పాత మెసేజ్‌లను కనుగొనడం కష్టం అవుతుంది.చాట్ ఫీచర్‌లో పిన్ మెసేజ్‌ల ద్వారా, మీరు లిస్ట్‌లో మూడు చాట్‌లను పిన్ చేయవచ్చు.దీని కోసం ముందుగా మెసేజ్‌ను నొక్కి పట్టుకోండి.దీని తర్వాత ఆండ్రాయిడ్‌లో పిన్ చాట్‌పై నొక్కండి.చాట్‌ను కుడివైపుకి స్వైప్ చేయడం ద్వారా చాట్ పిన్ చేయబడుతుంది.

మెసేజ్ ఎడిట్( Edit the message ): చాలా సార్లు మనం మెసేజ్‌లు పంపేటప్పుడు టైపింగ్ ఎర్రర్‌లు చేస్తుంటాము.చాలా సార్లు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను టైప్ చేయడం మరచిపోతాము.

కొన్నిసార్లు స్పెల్లింగ్ తప్పుగా ఉంటుంది.ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌తో, యూజర్లు మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయొచ్చు.

Telugu Whatsapp, Latest, Ups-Latest News - Telugu

కంపానియన్ మోడ్:( Companion Mode ) మీరు ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లను కలిగి ఉంటే, రెండింటిలోనూ వాట్సాప్ కావాలనుకుంటే కంపానియన్ మోడ్ ద్వారా సాధ్యపడుతుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు ఇప్పటికే ఉన్న వాట్సాప్ ఖాతాను మరొక ఫోన్‌కి లింక్ చేయవచ్చు.ఇలా రెండు ఫోన్లలో ఒకేసారి వాట్సాప్ వాడొచ్చు.

చాట్ లాక్:( Chat Lock ) వాట్సాప్‌లో ప్రైవేట్ చాట్‌లను పాస్‌వర్డ్‌తో లాక్ చేయవచ్చు.పాస్‌కోడ్, ఫేస్ ఐడీ, వేలిముద్ర వంటి వాటి ద్వారా ఇది సాధ్యపడుతుంది.లాక్ చేయబడిన చాట్‌లు వాట్సాప్‌లోని లాక్డ్ చాట్స్ అనే ప్రత్యేక ఫోల్డర్‌లో ఉంటాయి.దీని కోసం వాట్సాప్‌లో చాట్ ఇన్ఫోకి వెళ్లి, చాట్ లాక్‌పై నొక్కండి.హెచ్‌డీ ఫొటోలు: వాట్సాప్‌లో పంపిన ఫోటోలు హెచ్‌డీ నాణ్యతతో ఉండేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.దీని ద్వారా వాట్సాప్‌లో అధిక నాణ్యత గల ఫొటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube