పొడి జుట్టును రిపేర్ చేసే ఓట్స్.. ఇలా వాడితే మరిన్ని బెనిఫిట్స్!

సాధారణంగా కొందరి జుట్టు తరచూ పొడిబారిపోతుంటుంది.డ్రై నెస్ కారణంగా జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది.

 How To Repair Dry Hair With Oats , Dry Hair, Oats, Oats Hair Mask, Oats Hair Pa-TeluguStop.com

ఇటువంటి హెయిర్ ను రిపేర్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఖరీదైన షాంపూ, కండిషనర్ మరియు ఆయిల్స్ వాడుతుంటారు.

అయితే వాటితో పాటు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించాలి.ముఖ్యంగా పొడి జుట్టును రిపేర్ చేయడానికి ఓట్స్ చాలా బాగా సహాయపడతాయి.

Telugu Curd, Dry, Care, Care Tips, Healthy, Latest, Oats, Oats Benefits, Oats Pa

ఓట్స్ ( Oats )ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే డ్రై హెయిర్ సమస్య నుంచి బయటపడటమే కాకుండా మరెన్నో బెనిఫిట్స్ ను పొందుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు ఓట్స్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను వేసుకోవాలి.

అలాగే బాగా పండిన ఒక అరటిపండు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఓట్స్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.

Telugu Curd, Dry, Care, Care Tips, Healthy, Latest, Oats, Oats Benefits, Oats Pa

ముఖ్యంగా ఈ మాస్క్ డ్రై హెయిర్ సమస్య( Dry hair problem )ను చాలా వేగం గా రిపేర్ చేస్తుంది.పొడి జుట్టును స్మూత్ గా సిల్కీ గా మారుస్తుంది.ఓట్స్‌లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టును మాయిశ్చరైజ్ చేస్తాయి.

ఓట్స్ లోని ప్రోటీన్ జుట్టు పెరుగుద‌ల‌కు సహాయపడుతుంది.హెయిర్ ఫాల్‌ అరిక‌డుతుంది.

అంతేకాకుండా ఈ ఓట్స్ మాస్క్‌ స్ప్లిట్ ఎండ్స్‌ను రిపేర్ చేయడంలో మ‌రియు హెయిర్ రూట్స్ ను స్ట్రోంగ్ గా మార్చ‌డంలో సైతం అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube