హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ సమావేశాలకు షెడ్యూల్ విడుదల అయింది.ఇందులో భాగంగా ఈనెల 16న తెలంగాణ పీసీసీ ఇచ్చే లంచ్ కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది.అదేవిధంగా 17వ తేదీన సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సమావేశం తరువాత సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో విజయభేరీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఈ భారీ బహిరంగ సభకు సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీలు హాజరుకానున్నారు.
కాగా ఈ మేరకు చేపట్టాల్సిన అన్ని చర్యలను తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది.