అమెరికాలో ఇంకా భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఎదో ఒక కారణంతోనో అకారణంగానో దూషించడం సర్వ సాధారణం అయ్యిపోయింది జాత్యహంకార దాడులపై అమెరికా చట్టాలు చేసినా సరే అక్కడి ప్రజలు వాటిని చాలా తేలికగా తీసుకుంటున్నారు.
అయితే తాగాజా జరిగిన సంఘంటన ఇంకా భారతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పడానికి నిదర్సనమని చెప్పవచ్చు.వివరాలలోకి వెళ్తే.
2006లో భారత్ వదిలి చట్టబద్ధంగా తన కుటుంబంతో సహా అమెరికా వచ్చి 2010 నుంచి యాష్ ల్యాండ్ లో రెస్టారెంట్ నడుపుతున్న ఒక రెస్టారెంట్ యజమానిపై అతడి హోటల్ కి వచ్చిన వ్యక్తీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇంతకీ భారతీయ హోటల్ యజమాని చేసిన పని ఏమిటంటే భారతీయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం చెప్పడమే.అయితే భోజనం చేసి వెళ్తూ రెస్టారెంట్ ఫోటో తీసుకున్న ఆ కస్టమర్ దానిని ఫేస్ బుక్ లో ట్యాగ్ చేస్తూ ‘బహుశా నేను అల్ ఖైదాకు డబ్బులిస్తున్నాను’ అని రాశాడు…అయితే ఆ వ్యాఖ్యలకి స్పందించిన హోటల్ యజమాని ఈ వ్యాఖ్యలు చూస్తుంటే తనను తన్ని తరిమేయడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉందని భయపడ్డానని తెలిపాడు.
అయితే ఈ వ్యాఖ్యలకి స్పందించిన అక్కడి యాష్ ల్యాండ్ మేయర్ స్టీవ్ గిల్మోర్ ముగ్గురు సిటీ కమిషనర్లను వెంట తీసుకొని ద కింగ్స్ డైనర్ రెస్టారెంట్ కి వెళ్లారు…హోటల్ యజమాని తాజ్ సర్దార్ ని ఓదార్చి ధైర్యం చెప్పారు.జాతివివక్ష చూపేవారికి నగరంలో స్థానం లేదని గిల్మోర్ ప్రకటించారు.అయితే ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అక్కడి ఒక అంబులెన్స్ సర్వీస్ లో పనిచేస్తాడని అతడిని ఉద్యోగం లోనుంచీ తీసేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.తాజ్ సర్దార్ కి క్షమాపణలు తెలిపింది.