అక్రమంగా “అమెరికా” ప్రయాణం.. “భారత ఎన్నారై” సాహసం

భారత ఎన్నారై అతిపెద్ద సాహసమే చేశాడు.అమెరికా వెళ్ళడం తన కలగా పెట్టుకున్నాడు అయితే కొన్ని కారణాల వలన చట్ట ప్రకారం తలెత్తిన ఇబ్బందుల వలన ఆ కల అలాగే ఉండి పోయింది.

 Akram Ga America Prayanam-TeluguStop.com

అయితే అతడి కోరిక తీరలేదనే కసితో ఎలా అయినా తన కలని నిజం చేసుకోవాలని అనుకున్నాడు.దాంతో అతి పెద్ద సాహసమే చేశాడు.

అక్రమంగా అయినా సరే అమెరికా వెళ్ళాలని అనుకున్నాడు వివరాలలోకి వెళ్తే…

అమెరికా వెళ్ళాలని అనుకున్న ఆ యువకుడి పేరు హర్పీత్ సింగ్.పంజాబ్ రాష్ట్రానికి చెందిన అతడు తన కోరిక ఫలించక పోవడంతో అడ్డ దారిలో అమెరికాకి పయనమయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 దేశాలు గుండా 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్రమంగా అమెరికాలో చొరబడ్డాడు.

దాదాపు ఏడాదిన్నపాటు అమెరికాలోని లూసియానాలో పని చేశాడు.

ఇదిలాఉంటే అతడు ముందుగా భారత్ నుంచీ బ్రెజిల్ వెళ్ళాడు అక్కడి నుంచీ బొలివియా చేరుకొని మళ్ళీ పేరూ వెళ్లి ఈక్వెడార్.

కోస్టారికా.కొలంబియా.

పనామా.హొండురాస్.

గ్యాటెమాలా.మెక్సికో చేరుకున్నాడు.

అయితే అక్కడి నుంచీ పడవ మార్గంలో అమెరికా చేరుకున్నాడని అధికారులు గుర్తించారు.దాంతో అతడిని పట్టుకుని విచారించి తిరిగి భారత్ కి పంపేశారు.

చివరికి హర్పీత్ ని పట్టుకుని న్యూఢిల్లీ పోలీసులకు అప్పగించారు.అయితే అతడు ఈ ప్రయాణం కోసం ఒక ఏజెంట్ సలహా తీసుకున్నాడని తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube