మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ అనే కార్యక్రమంతో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న జీ తెలుగు

మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు.ఏ పక్షయినా ఒక్క రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ జయహో.

 Zee Telugu Is Celebrating World Women's Day With The Program  Child, Does This W-TeluguStop.com

జనయిత్రి’ అంటూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులకు అందరి మనసులకి చాలా దగ్గరగా ఉండే జీ తెలుగు ‘మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ’ అంటూ ఒక కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం చేయనుంది.

అన్నీ మారుతున్నాయి.

మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప.అవును.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతఅని ఆర్యోక్తి.దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని.కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది.అలా పుట్టిన పాప దగ్గర నుండి ఒక నారి పడే కష్టాలు ఎన్నో, ఆ కష్టాలు మరియు కన్నీళ్లను మన ముందు తెస్తున్నారు జీ తెలుగు కుటుంబం యొక్క మహిళలు.

మేఘన లోకేష్, శ్రీ దేవి, సునంద మాలాశెట్టి, రీతూ చౌదరి, మధుమిత మరియు తదితర తారలు అందరు కూడా వారి ప్రదర్శనలతో అందరిని అలరించబోతున్నారు.ఈ ఆదివారం మార్చి 7 నాడు 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డీ లలో.

రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికి తామేమీ తీసిపోమని చాటిచెప్తుంది స్త్రీ శక్తితాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు.అలాంటి స్త్రీ మూర్తులను జీ తెలుగు సాదరంగా సత్కరించబోతున్నారు.

మిస్ ఇండియా 2020 మానస వారణాసి, జీవిత రాజశేఖర్, యాంకర్ ఉదయభాను, కనకవ్వ – తెలంగాణ జానపద కళాకారిణి, ఎస్ ఐ శిరీష – శ్రీకాకుళం, వీణ శ్రావణి, శివ జ్యోతి, జోగిని శ్యామల, సంధ్య రాజు, మరియు శివ పార్వతి తదితర మహిళలను మరియు వారి గాధలను అందరి ముందుకు తేబోతుంది మన జీ తెలుగు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడానికి మన అందరి హృదయాలకి ఎంతో దగ్గర ఉండే ఆప్తుడు, స్నేహితుడు ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

మగువ, ఈ లోకానికి తెలుసా నీ విలువ అనే ఈ కార్యక్రమం ఈ ఆదివారం మార్చి 7 నాడు 5 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానల్లలో తప్పక వీక్షించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube