పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మీ ముందుకు తీసుకు వస్తున్న జీ తెలుగు

మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు మేం అబ్బాయిలను అడగొద్దా? ఇదేం న్యాయం నందాజీ’అంటూ కోర్టులో కొణిదెల సత్యదేవ్ వేసిన కౌంటర్స్ ఇప్పటికీ గోల పెట్టిస్తున్నాయి.అది పవన్ కళ్యాణ్ మానియా.

 Zee Telugu Is Bringing Power Star Pawan Kalyan 'vakil Saab' To You As The World-TeluguStop.com

మూడేళ్ళ విరామం తరవాత మళ్లీ అందరిని అలరించడానికి ఆయన వచ్చారు.ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లో రిలీజ్ అయ్యి రికార్డులను బద్దలు కొట్టింది – ‘వకీల్ సాబ్‘.

అంకెలతో గుర్తించుకునే సినిమా లెక్కలుతేలేది కొన్నాళ్లలోనే కానీ మనసుకి దగ్గరైన సినిమా జీవితకాలం గుర్తుంటుంది.అలా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను మనకు ఎంతో ఇష్టమైన జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనుంది.

చాలా సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ సినిమా మన జీ తెలుగు లో రాబోతుంది.మరి ఆ సందడి ఎలా ఉంటుందో చూడాలి అంటే ఈ ఆదివారం జులై 18 సాయంత్రం 6:00 గంటలకు తప్పక వీక్షించండి.

మధ్యతరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పల్లవి ( నివేదా థామస్), జరీనా (అంజలి ), దివ్య నాయక్ (అనన్య) సిటీకి వచ్చి ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు.ఓరోజు రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలసి ఈ ముగ్గురుపై కన్నేస్తారు.

వాళ్లని నమ్మించి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్లి బలవంతం చేయబోతారు.అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పల్లవి వంశీని మందు సీసాతో కొట్టి పారిపోతుంది.అయితే ఎంపీ రాజేంద్ర తన పలుకుబడిని ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై రివర్స్ కేసు పెట్టిస్తారు.ఈ తరుణంలో కేసు గెలవాలని కాకుండా న్యాయం గెలవాలని పోరాటం చేస్తూ.

నాలుగేళ్లు పాటు కోర్టు నుంచి సస్పెండైన వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్‌)ని కలుస్తారు.వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు యువతుల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు.

Telugu July, Premier, Thi Sunday, Vakeel Sab, Zee Telu Gu Net, Zee-Latest News -

జరీనా క్యారెక్టర్ తో అందరిని మెప్పించిన అంజలి మాట్లాడుతూ,మన దేశంలో ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న ఒక వాస్తవికతను వకీల్ సాబ్ సినిమాలో చిత్రీకరించారు.ఈ చిత్రం ద్వారా మహిళలు సామాజిక ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా ముందడుగు వేస్తారని నేను ఆశిస్తున్నాను.ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ని మీ కుటుంబంతో తప్పక వీక్షించండి.

ఒక సోల్ ఉన్న కథ ప్రేక్షకుడ్ని ఎప్పుడూ నిరాశపరచదు.

వకీల్ సాబ్ చిత్రం కూడా అలాంటిదే.తెరపై వాస్తవ జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి.

అనాదిగా స్త్రీ యొక్క ఆలోచనలను, హక్కులను, స్వేచ్ఛని అణిచివేస్తున్న అనేక అంశాల్ని నిక్కచ్చిగా కోర్టు బోనులో నిలబెట్టి నిగ్గుతేల్చాడు వకీల్ సాబ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కంబ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ ఈ ఆదివారం 18 జులై సాయంత్రం 6:00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో తప్పక వీక్షించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube