దీప్తి సునైనా ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. త్వరలో సూపర్‌ ప్రాజెక్ట్‌

యూట్యూబ్ సెన్షేషన్ గా గుర్తింపు దక్కించుకున్న దీప్తి సునైనా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది.దీప్తి సునైనా ఆ మధ్య బిగ్ బాస్ తర్వాత బాగా వైరల్‌ అయ్యింది.

 Youtuber Deepthi Sunaina Got Chance As Heroine In Webseries,deepthi Sunaina,webs-TeluguStop.com

షన్నూ తో బ్రేకప్‌ తర్వాత ఈ అమ్మడు కాస్త హడావుడి లేకుండా కనిపించింది.దాంతో దీప్తి సునైనా మరోసారి వార్తల్లో నిలువబోతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ దర్శకుడు రూపొందించబోతున్న సినిమాలో దీప్తి సునైనా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.దీప్తి సునైనా విషయంలో గత కొన్నాళ్లుగా కొందరు పలు రకాలుగా పుకార్లు పుట్టిస్తున్నారు.

నటనకు దీప్తి సునైన గుడ్ బై చెప్పేసినట్లుగా కామెంట్స్ చేశారు.కానీ అసలు విషయం ఏంటీ అంటే దీప్తి సునైనా యూట్యూబ్‌ తో పాటు ప్రతి ఒక్క అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Shannu, Youtube-Movie

వెబ్‌ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమా ల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.యూట్యూబ్‌ ద్వారా ఇప్పటికే సెలబ్రెటీ హోదాను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు మరియు సిరీస్ ను చేయడం ద్వారా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Shannu, Youtube-Movie

మరో వైపు షన్నూ కూడా హీరోగా వెబ్‌ సిరీస్‌ చేసిన విషయం తెల్సిందే.హీరోయిన్ గా ఒక వైపు దీప్తి సునైన వెబ్ సిరీస్ ను చేస్తూ ఉంటే మరో వైపు షన్నూ కూడా బుల్లి తెరపై మరియు ఓటీటీ ద్వారా రెగ్యులర్ గా సందడి చేస్తున్న విషయం తెల్సిందే.దీప్తి సునైనా మరియు షన్నూ లు కలిసి నటించాలని కూడా కోరుకుంటున్నారు.అది సాధ్యమా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube