ఈ సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనను చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ సక్సెస్ దక్కినా కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు.కొరటాల శివ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

 Young Tiger Ntr Movies Super Action Scenes In These Movies Details, Ntr, Junior-TeluguStop.com

టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు సినిమాసినిమాకు తారక్ కు సక్సెస్ తో పాటు మార్కెట్ కూడా పెరిగిందనే సంగతి తెలిసిందే.

అయితే తారక్ సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యే విధంగా ఉన్నాయి.

స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, టెంపర్, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రేక్షకులు తారక్ నటనకు ఫిదా అయ్యే విధంగా ఉన్నాయి.ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 కాగా క్లాస్ గా కనిపిస్తూనే తనదైన అభినయంతో ఈ సినిమాలో తారక్ మెప్పించారు.

ఎన్టీఆర్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆది తారక్ టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు తారక్ కు స్టార్ స్టేటస్ రావడానికి కారణమైంది.

Telugu Aadi, Brindavanam, Jr Ntr, Ntr, Netizens, Rakhi, Simhadri, Number, Tarak,

ఈ సినిమాలో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను ప్రేక్షకులు మరిచిపోలేరు.ఎన్టీఆర్ జక్కన్న కాంబోలో సింహాద్రి తెరకెక్కగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు.ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే ఎన్నో సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

రాఖీ సినిమాలో కోర్టు సీన్ లో తారక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.యమదొంగ సినిమాతో ఈతరం హీరోలలో పౌరాణిక పాత్రల్లో కూడా మెప్పించే హీరో తానేనని తారక్ ప్రూవ్ చేశారు.

Telugu Aadi, Brindavanam, Jr Ntr, Ntr, Netizens, Rakhi, Simhadri, Number, Tarak,

ఈ సినిమా కోసం తారక్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గి వార్తల్లో నిలిచారు.బృందావనం తర్వాత సరైన సక్సెస్ లేని తారక్ టెంపర్ సినిమాలో క్లైమాక్స్ లో నటించిన తీరుకు ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.నాన్నకు ప్రేమతో సినిమా ద్వారా స్టైలిష్ రోల్స్ కూడా అద్బుతంగా చేయగలనని తారక్ ప్రూవ్ చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ నటన న భూతో న భవిష్యత్ అనే విధంగా ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube