Pawan Kalyan : పవన్ కు ప్రత్యర్థిని సిద్దం చేస్తున్న వైసీపీ ? ఆమెను మార్చేస్తున్నారా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) మొన్నటి వరకు భీమవరం నియోజకవర్గ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.దీనికి తగ్గట్లుగానే పవన్ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.

 Ycp Targets Janasena Pawan Kalyan Pithapuram Constituency-TeluguStop.com

ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పోటీ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తే తనకు తిరుగు ఉండదనే అంచనాకు వచ్చారు.అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో,  తన గెలుపునకు డొఖా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు.2019 ఎన్నికల్లో భీమవరం( Bhimavaram ) నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందారు.అలాగే గాజువాక నుంచి పోటీ చేసినా అక్కడా అదే పరిస్థితి.అందుకే ఈసారి తప్పకుండా గెలిచే స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు .

Telugu Ap, Jagan, Pendem Dorababu, Vanga Geetha, Ycptargets, Ysrcp-Politics

కచ్చితంగా టిడిపి,  జనసేన ప్రభుత్వం( TDP-Janasena Government ) ఏర్పడుతుందని , తాను కీలక పదవిలోని ఉంటానని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు.అందుకే పిఠాపురం పైన ఫోకస్ పెట్టడంతో వైసిపి( YCP ) కూడా అంతే స్థాయిలో ప్రత్యర్ధిని సిద్ధం చేస్తోంది.పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనైనా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండా చూడాలని చూస్తున్న వైసిపి, పవన్ పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేసినా,  ఆయనను ఓడించాలని,  అందుకు వైసిపి నుంచి బలమైన అభ్యర్థిని పోటీక దింపాలని చూస్తుంది.ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉండగా,  కాకినాడ ఎంపీ వంగ గీతను పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా వైసిపి నియమించింది .అయితే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయం కావడంతో,  వంగ గీత( Vanga Geetha ) ను తప్పించి ఆస్థానంలో మరో బలమైన కాపు సమాజిక వర్గానికి చెందిన నేతను పోటీకి దింపాలని జగన్ భావిస్తున్నారు.

Telugu Ap, Jagan, Pendem Dorababu, Vanga Geetha, Ycptargets, Ysrcp-Politics

వంగా గీతకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.ఇక కాపు ఉద్యమ నేత , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తూ ఉండడం తో ఆయన కుటుంబంలో ఒకరికి పిఠాపురం నియోజకవర్గ సీటును ఇస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే దానిపైన జగన్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.దానికి అనుగుణంగానే పిఠాపురంలో వైసిపి అభ్యర్థిని మార్చాలని చూస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube