ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరిందని మంత్రి పెద్దిరెడ్డి( Peddireddy Ramachandra Reddy ) అన్నారు.అందరూ ఏకం అవుతారని మొదటి నుంచి చెప్తున్నామన్నారు.
సీఎం జగన్ ఎప్పుడూ సింగిల్ గానే వస్తారని చెప్పారు.
ఈ నెల 18న సిద్ధం సభ వేదికగా జగన్ మ్యానిఫెస్టో( CM Jagan )ను విడుదల చేస్తారని తెలిపారు.టీడీపీ అజెండాలో భాగంగా షర్మిల పని చేస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి తెలుస్తుందని వెల్లడించారు.
ఏపీ అభివృద్ధికి జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.