ప్రకాశం జిల్లాలోని కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఇళ్ళు ముట్టడించే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు.వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో వైసిపి కార్యాలయం నుండి నాయుడు పాలెం లోని ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో బయల్దేరారు.
అయితే టంగుటూరు లోని టోల్ గేటు వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు.దీంతో వైసిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
దీంతో జాతీయ రహదారిపై బైఠాయించిన వైసిపి నేతలు ఎమ్మెల్యే స్వామికు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.స్వామి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే ఇటీవల ఎమ్మెల్యే స్వామి సిఎం జగన్ తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై పలు వ్యాఖ్యలు చేసారు.అందుకు నిరసనగానే స్వామి ఇళ్ళు ముట్టడించే ప్రయత్నం చేసినట్టు వైసిపి నేతలు చెప్తున్నారు.