ఏపీ కాంగ్రెస్( AP Congress ) అధ్యక్షురాలింగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన వైస్ షర్మిల అధికార పార్టీ వైసీపీ( Ys sharmila )ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు .ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయని ఆమె పదే పదే విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.మధ్య మధ్యలో జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
షర్మిల చేస్తున్న విమర్శలు వైసీపీకి, జగన్ కు డామేజ్ కలిగించేవే అయినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది అధికార పార్టీ .ఎప్పటికప్పుడు షర్మిల విమర్శలను తిప్పికొడుతోంది.కాకపోతే దూకుడుగా విమర్శలు చేసే వైసిపి నేతలను కట్టడి చేసి, హుందాగా విమర్శలు చేసే నేతలను రంగంలోకి దింపింది.
షర్మిల చేస్తున్న అన్ని విమర్శలకు ఆ వైసీపీ కీలక నేతలంతా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు.లెక్కలతో సహా వివరిస్తున్నారు.మరికొద్ది నెలలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతుండడం తో, జనసేన ,టిడిపి( Janasena, TDP )లకు అవకాశం లేకుండా షర్మిల విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ వాటికి సమాధానం చెబుతున్నారు.
విభజన హామీలు అమలు చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందంటూ టిడిపి జనసేన లో అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండడంతో పాటు, వచ్చే ఎన్నికల్లోను వాటిని ప్రధానాస్త్రాలుగా చేసుకునే ఛాన్స్ ఉండడంతో ప్రస్తుతం షర్మిలను టార్గెట్ చేసుకున్నారు .
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాన్నిఅధిగతిపాలు చేసిందని, విభజన హామీలను పరిష్కరించలేదని, అటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల తమను ఎలా ప్రశ్నిస్తుందని వైసీపీ నేతలు షర్మిలకు కౌంటర్ ఇస్తున్నారు.దీంతో టిడిపి జనసేన లకు ఈ విషయాలపై విమర్శలు చేసే అవకాశం లేకుండా షర్మిల విమర్శల కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఎక్కడా షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా, కాంగ్రెస్ ను ఇరుకుని పెట్టే విధంగా వైసిపి నేతలు చేస్తున్న విమర్శలతో కాంగ్రెస్, వైసీపీల మధ్య విమర్శలు ,ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ,విజయ సాయి రెడ్డి ,మిథున్ రెడ్డి ,ధర్మాన కృష్ణ దాస్ వంటి నేతలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నారు.షర్మిల వైసీపీ పై చేసే ప్రతి విమర్శకు సమాధానం ఇస్తూ, మీడియాలో షర్మిల విమర్శలు హైలైట్ అయ్యేలా చూసుకుంటూ.
టిడిపి, జనసేన లకు అవకాశం లేకుండా చేసే వ్యూహంలో వైసిపి ఉన్నట్టుగా అర్థమవుతుంది.