విశాఖలోని గాజువాక ఇంఛార్జ్( YCP Gajuwaka Incharge ) మార్పుపై వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తుంది.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డిని( Tippala Nagireddy ) తప్పించి ఉరుకూటి చందుకు( Vurukuti Chandu ) ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలోనే గాజువాక అభ్యర్థి చందు అంటూ పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి సైతం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే చందు అభ్యర్థిగా ఉంటే సహకరించబోనని ఎమ్మెల్యే నాగిరెడ్డి పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పారు.
అభ్యర్థిని మార్చాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు( Minister Botsa Satyanarayana ) నాగిరెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే విషయాన్ని బొత్స అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.దీంతో చందుకు బదులుగా మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి( Mayor Golagani Hari Venkata Kumari ) అయితే బాగుంటుందని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో గాజువాక అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది.