ప్రస్తుతం వర్షాకాలం కాకపోయినా ఢిల్లీ-ఎన్‌సీఆర్( Delhi NCR )తో సహా భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో వానలు కురుస్తున్నాయి.దీంతో వాతావరణం చల్లగా ఉండడంతో పాటు రోడ్ల జలమయం అవుతున్నాయి.
దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఢిల్లీలో ఇప్పుడు వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్( Instagram )లో ఓ వీడియోలో వైరల్ గా మారింది.అందులో ఒక వ్యక్తి బైక్‌పై జలమయమైన రహదారిపై పనికి వెళ్తున్నట్లు కనిపించింది.
అతని బైక్ దాదాపు నీటిలో మునిగింది, కానీ అతను దాన్ని ఆపలేదు లేదా వేగాన్ని తగ్గించలేదు.వీలైనంత త్వరగా తన గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటున్నాడు.
అందుకే అతడు బైక్ రైడ్ చేస్తూ ముందుకు వెళుతూనే ఉన్నాడు.
పసుపు రంగు రెయిన్‌కోట్( Yellow Rain Coat )లో ఉన్న ఆ వ్యక్తి తన బైక్‌ను చాలా బాగా నడుపుతున్నాడు.అతను నీటిలో ఇరుక్కుపోయిన కారును దాటి వెళ్ళాడు.చుట్టుపక్కల ఇళ్లు కూడా నీటమునిగాయి.
అతడు తన బైక్‌ను పడవలా వినియోగిస్తున్నట్లుగా వీడియో కనిపిస్తోంది.ఈ వీడియో చూసి సోషల్ మీడియా( Social Media ) యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇది ఇన్‌స్టాగ్రామ్ లోనే కాకుండా ఇతర సోషల్ మీడియా సైట్స్ లో కూడా వైరల్ అవుతుంది.
కార్లు తెప్పల లాంటివి, బైక్‌లు జెట్‌ల వంటివి ఒక మరొక యూజర్ జోక్‌లు వేశాడు.ఇంటిలో కూడా దూసుకెళ్తున్న ఆ బైక్ ఏంటో తెలుసుకోవాలని ఉందని ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు.ఇంత పెద్ద వరదలు వస్తున్నా పనికి వెళ్తున్నాడు అంటే ఇతడి డెడికేషన్ మామూలుగా లేదు అని మరి కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెట్టారు.
ఇలాంటి నీటిలో డ్రైవ్ చేస్తే పైకి పాడైపోతుందేమో అని ఒకరు అనగా, ఇది చాలా ప్రమాదకరం అని మరొకరు అన్నారు.ఈ వీడియో( Viral Video ) ఎక్కడ షూట్ చేశారో తెలియ రాలేదు.
ఇది భారతదేశంలోని లేదా చైనాలోని ఒక నగరంలో రికార్డ్ చేసి ఉండవచ్చు.