ఏపీలోని సీఎం జగన్( CM Jagan ) ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ( TDP ) ఇవాళ చార్జ్‌షీట్ విడుదల చేయనుంది.ఈ మేరకు ‘ ప్రజా కోర్టు’( Praja Court ) పేరుతో తెలుగుదేశం పార్టీ చార్జ్‌షీట్ రిలీజ్ చేయనుంది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలతో పాటు నవరత్నాలు – నవమోసాలు అయ్యాయని ఆరోపిస్తూ టీడీపీ నేతలు చార్జ్‌షీట్ తయారు చేశారు.
మరోవైపు ఇవాళ టీడీపీ శానససభా పక్ష సమావేశం జరగనుంది.ఇందులో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో( Assembly Sessions ) అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అటు వైసీపీ ప్రభుత్వానికి కూడా చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో అన్ని వ్యూహాలను టీడీపీ సిద్ధం చేస్తుందని సమాచారం.