ఈ సీజన్ బిగ్ బాస్( Bigg Boss ) లో అందరి ఆట ని చెడగొడుతున్న ఏకైక కంటెస్టెంట్ ఎవరు అంటే అది శివాజీనే అనేది ఈ వారం అందరికీ అర్థం అయిపోయింది.అతను ఆడుతున్న కన్నింగ్ గేమ్ ఈ వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున కూడా బయటపెట్టడం లో సక్సెస్ అయ్యాడు.
ఈ వారం లో ఆయన సంచాలక్స్ ని ఎలా ఏమార్చాడో, వాళ్ళ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేసాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.సంచాలక్స్ గా వ్యవహరించిన వారిలో అందరూ నూటికి నూరు శాతం ఎవ్వరూ పర్ఫెక్ట్ గా చెయ్యలేదు.
ఇది అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ ఈ వారం సంచాలక్ గా వ్యవహరించిన శోభా శెట్టి ని ఆమె నిర్ణయం చెప్పే ముందే ఎలా ఏమార్చాలని చూశాడో, ఎలా భయపెట్టాలని చూశాడో, జనాలకు ఎలా తప్పుగా ప్రాజెక్ట్ చెయ్యాలని చూశాడో మొత్తం బయటపడింది.ఏవిక్షన్ పాస్ లో భాగంగా ‘బాణం టాస్క్’ లో ప్రియాంక కరెక్ట్ ఆడింది, లెక్క ప్రకారం ఆమెనే గెలవాలి.
ఇది శోభా శెట్టి( Shobha Shetty ) నిర్ణయం, కానీ అది చెప్పి ఉంటే శివాజీ మరియు యావర్ అంగీకరించేవారా?, యావర్ అంగీకరించినా, శివాజీ ఒప్పుకోడు.మొదటి వారం నుండి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ జనాలకు రుద్దేస్తాడు.ఇది భయపడే శోభా శెట్టి మనకి ఎందుకు గొడవ మళ్ళీ ఇతనితో అనుకోని యావర్( Yawar ) ని విన్నర్ గా ప్రకటించింది.కానీ ఈరోజు నాగార్జున వీడియోస్ వేసి యావర్ ఆడిన ఫౌల్ గేమ్స్ మొత్తాన్ని చూపించిన తర్వాత శివాజీ ని ఇప్పుడు చెప్పు అంటే, ప్రియాంకనే పర్ఫెక్ట్ గా ఆడింది, ఆమెనే విన్నర్ సార్ అన్నాడు.
ఇతని వల్ల ప్రభావితమై యావర్ కూడా వాళ్ళ బ్యాచ్ కాబట్టి ప్రియాంక నే విన్నర్ ని చేస్తారు అని ఆటలో ఉన్నప్పుడు శివాజీ తో అంటాడు.కానీ ఫౌల్ గేమ్ ఆడిన తర్వాత నిజాయితీగా యావర్ ‘ఏవిక్షన్ పాస్'( Eviction Pass ) ని వెనక్కి ఇచ్చేయడం మాత్రం అతనికి బాగా ప్లస్ అయ్యింది.
ఈ ఒక్కే ఒక్క పనితో యావర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.కానీ యావర్ ఇంకా శివాజీ( Shivaji ) నీడలో ఉంటే మాత్రం అతను టాప్ 5 లోకి ఎంటర్ అవ్వడం కూడా కష్టమే అని చెప్పొచ్చు.మొత్తానికి ఈ వారం యావర్, అమర్ మరియు ప్రియాంక( Priyanka Jain ) కి బాగా కలిసొచ్చింది.శివాజీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గుతూ పోతుంది.ఇతను ఏమిటో జనాలు నెమ్మదిగా తెలుసుకుంటున్నారు.ఇంతకు ముందు కచ్చితంగా టాప్ 1 శివాజీ అన్నట్టుగా ఉండేది.
కానీ ఇప్పుడు టాప్ 1 స్థానం కోసం అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ పోటీ పడుతున్నారు అని చెప్పొచ్చు.చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.