నిమిషాల వ్యవధిలో 80 డంప్లింగ్స్ తిన్న మహిళ.. ఆమె ఈటింగ్ స్పీడ్ చూస్తే షాకే...

మోమోస్, డంప్లింగ్స్ ఫుడ్ ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.ఇవి అచ్చం కుడుములు, ఉండ్రాళ్ల వలె కనిపిస్తుంటాయి.

 Woman Eating 80 Dumplings In A Few Minutes Video Viral Details, Viral News, Late-TeluguStop.com

తయారీ కూడా సేమ్ ఉండ్రాళ్ళ వలె ఉంటుంది.మోమోస్( Momos ) మొదటగా టిబెట్, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో పాపులర్ అయ్యాయి.

తర్వాత అన్ని ప్రాంతాలలోని ప్రజలను ఆకట్టుకోవడం మొదలుపెట్టాయి.ఇక కజ్జికాయల వలె ఉండే డంప్లింగ్స్( Dumplings ) కూడా విదేశాల్లో బాగా పాపులర్ అయ్యాయి.

అయితే వీటిని మనుషులు సింగిల్ సిట్టింగ్‌లో 10 లేదా మహా అంటే పాతిక దాక తినగలుగుతారు.అంతకుమించి తినగలిగే వారు ఉండరని భావించవచ్చు.

అయితే ఒక మహిళ అందరి భావనలను తప్పు అని నిరూపించింది.ఆమె ఎవరి ఊహలకు అందని దానికి మించి తినేసింది.ఆమె సింగిల్ సిట్టింగ్‌లో ఏకంగా 80 డంప్లింగ్స్( 80 Dumplings ) లాగించింది.పక్కన డ్రింక్స్‌ పెట్టుకొని అవి కొంచెం కొంచెం తాగుతూ చాలా ప్లేట్లో పెట్టిన డంప్లింగ్స్ వివాహ భోజనంబు అనుకుంటూ స్పీడుగా తినేసింది.

ఆమె వీటిని తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది చూసి చాలామంది షాక్ అవుతున్నారు.అన్నీ ఒకేసారి ఆమె ఎలా తినగలిగిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు.అన్ని ఒకేసారి కడుపులో వేసుకుంటే వాష్ రూమ్ కి వెళ్ళేటప్పుడు అసౌకర్యం కలగదా అవి ఎలా అరుగుతాయి అని మరికొందరు సందేహాలు వ్యక్తం చేశారు.

ఆమె చాలా ఫుడ్ కాంపిటీషన్స్ లో( Food Competition ) పాల్గొన్నదేమో అని మరికొందరు పేర్కొన్నారు.

టేబుల్‌పై ఉంచిన మోమోస్ ప్లేట్‌లన్నింటినీ కొన్ని నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె ఈటింగ్ సామర్థ్యాన్ని చూసి చాలామంది అవాక్కవుతున్నారు.అన్‌లిమిటెడ్ ఫుడ్ ఆఫర్ చేస్తామని చెప్పే రెస్టారెంట్స్ కి ఈమె వెళ్తే వారి జేబుకు చిల్లు పడటం ఖాయమని మరికొందరు ఫన్నీగా పేర్కొన్నారు.ఈ వైరల్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube