విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే పార్టీలో అనేకానేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆయన విశాఖ జిల్లాకు మంత్రిగా ఉన్నా కూడా ఆయనకు అక్కడ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఎక్కువుగా ఉంది.
అక్కడ వ్యవహారాలు అన్ని ఎంపీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి.దీంతో అవంతి లోలోన రగిలి పోతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఆయనకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. అవంతి కుమార్తె జీవీఎంసీ కార్పొరేటర్‌గా 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు.
ఆమెను కార్పొరేటర్‌గా గెలిపించుకోవడంతో పాటు డిప్యూటీ మేయర్ చేయాలన్నదే అవంతి ప్లాన్.అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంకను అవంతి శ్రీనివాసరావు పక్కా ప్లానింగ్‌తోనే కార్పొరేటర్‌గా పోటీ చేయిస్తున్నట్టు అర్థమవుతోంది.
ఈ వార్డు విశాఖ శివారు పరిధిలోకి వస్తుంది.ఈ ఎన్నికలు గత యేడాది జరిగి ఉంటే లక్ష్మీ ప్రియాంక గెలుపు నల్లేరుమీద నడకే అయ్యి ఉండేది.
అయితే ఇప్పుడు రాజకీయం మారింది.కుమార్తె గెలుపు విషయంలో అవంతి చాలా టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.

లక్ష్మీ ప్రియాంక డాక్టర్ కోర్సు పూర్తి చేశారు.ఆమె అవంతి విద్యా సంస్థలను చూసుకుంటున్నారు.ఆమె రాజకీయాల పట్ల ఆసక్తితోనే ఎన్నికల బరిలో ఉన్నారు.అయితే ఇక్కడ ఇప్పుడు జనసేన + టీడీపీ + కమ్యూనిస్టులు కలిసి పోవడంతో అవంతి కుమార్తెకు ఎదురీత తప్పలేదు.
అలాగే ఆయనే విశాఖకు నాన్ లోకల్ అని.పైగా ఆయన కుమార్తెను కూడా పోటీ చేయించి.డిప్యూటీ మేయర్‌ను చేస్తే విశాఖ లోకల్ నాయకుల పరిస్థితి ఏంటని అక్కడ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఇప్పుడు సొంత పార్టీలోనే కొందరు ఆయనకు సహకరించలేదని అంటున్నారు.
రేపు కుమార్తె రిజల్ట్ విషయంలో తేడా వచ్చినా… అటు భీమిలి పరిధిలో ఉన్న డివిజన్లలో ఎక్కువ కార్పొరేటర్ సీట్లు రాకపోయినా అవంతి పదవి ఊడడం ఖాయమే అంటున్నారు.అందుకే ఆయనకు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు టెన్షన్ తప్పేలా లేదు.