ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా నేడు విడుదలైంది.ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ అనుదీప్ దర్శకత్వం వహించారు.
యూఎస్ లో ఇప్పటికే జాతిరత్నాలు సినిమా ప్రీమియర్ షో పూర్తి కాగా టీజర్, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.
కెరీర్ లో ఎదగాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు వచ్చిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లోకల్ ఎమ్మెల్యేను చంపడానికి ప్రయత్నించారనే అభియోగంపై జైలుకు వెళతారు.
లోకల్ ఎమ్మెల్యే మర్డర్ కేసులో వీళ్లు ముగ్గురు ఎలా ఇరుక్కున్నారు.? ఈ కేసు నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు.? సినిమాలో చిట్టి ఎవరు.? చిట్టి, శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) పాత్రల మధ్య లవ్ స్టోరీ ఏమిటి.? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ.

ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు జాతిరత్నాలు సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.నవీన్, రాహుల్, ప్రియదర్శి తమ పాత్రల్లో చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.ఈ సినిమా తర్వాత బ్రహ్మానందంకు ఆఫర్లు పెరుగుతాయనడంలో సందేహం అవసరం లేదు.
బ్రహ్మానందం తన ఎక్స్ ప్రెషన్లతోనే ప్రేక్షకులకు కావాల్సిననంత ఎంటర్టైన్మెంట్ ను అందించారు.ఫస్టాఫ్ ను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన అనుదీప్ సెకండాఫ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని చెప్పవచ్చు.
సినిమాసినిమాకు మార్కెట్ పెరిగే విధంగా నవీన్ పోలిశెట్టి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా చిట్టి పాత్రకు న్యాయం చేసింది.సినిమాలోని వన్ లైనర్స్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉన్నాయి.నాగ్ అశ్విన్ నిర్మాతగా జాతిరత్నాలు సినిమాతో సక్సెస్ సాధించారనే చెప్పాలి.
క్లైమాక్స్ సీన్ తో కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం జాతిరత్నాలు ప్రత్యేకత.నాగ్ అశ్విన్ సినిమాకు అవసరమైనంత మేర ఖర్చు చేశారు.
ఇతర సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది.కొన్ని లాజిక్ సన్నివేశాలు, సెకండాఫ్ లో స్లోగా సాగే కథనం మినహా సినిమాకు పెద్దగా మైనస్ లు లేవనే చెప్పాలి.