కేంద్రం ఆ బ్యాంక్ ను కూడా అమ్మనుందా.?

భారత ప్రభుత్వం తాజాగా LIC విక్ర‌యంపై ఓ క్లారిటీ ఇచ్చింది.అవును.

 Will The Center Also Sell The Bank , Lic, Central Govt, Latest News, Buyed-TeluguStop.com

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ అయినటువంటి తుహిన్ కాంతా పాండే తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.LICతో పాటుగా మ‌రో బ్యాంక్ను కూడా అమ్మడానికి సర్వత్రా రంగం సిద్ధం అయిందంటూ పేర్కొన్నారు.

వచ్చే నెల అనగా మార్చ్ నాల్గవ వారంలో IDBI బ్యాంక్ విక్ర‌యంపై ఓ క్లారిటీ ఇస్తామన్నారు.అయితే బ్యాంక్‌లో మొత్తం వాటాను అమ్మ‌క పోవ‌చ్చ‌ని ఆయ‌న ఓ హింట్ ఇచ్చారు.

ఇకపోతే IDBI బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ వాటా సుమారుగా 49.24 శాతం వరకు LIC క‌లిగి వుంది.అలాగే ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా 45.48 శాతం ఉంది.ఇక బ్యాంకులో నాన్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వాటా 5.29 శాతం వరకూ వుంది.ప్రస్తుత సమాచారం మేరకు ప్రభుత్వం వచ్చే వారం మార్కెట్ రెగ్యులేటర్‌లో LIC యొక్క DRHP (డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ) లేదా ప్రైమరీ ప్రాస్పెక్టస్‌ను ఫైల్ చేస్తుంద‌ని స‌మాచారం.ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయాలని భావిస్తోంది.

దీనిపై DIPAAM (పార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) సెక్రటరీ అయినటువంటి తుహిన్ కాంతా పాండే మాట్లాడారు.

ఈ నేపథ్యంలో DIPAAM RBIతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.

ఈ క్రమంలో అన్ని లైసెన్స్‌లు టెక్నీకల్ అంశాలను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఫైనాన్షియల్ బిడ్‌లు వేసిన తర్వాత ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకుంటారట.

బ్యాంక్‌లో LIC, ప్రభుత్వ వాటాలను కలిసి విక్రయించాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు ఆయ‌న మాట్లాడారు.అయితే మొత్తం వాటాను అమ్మే ఉద్దేశం లేద‌ని అన్నారు.ప్ర‌స్తుతం ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.15-20 లక్షల కోట్లు ఉండ‌వ‌చ్చ‌నే అంచనాలు వినబడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube