మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) చిన్న కూతురు శ్రీజ ( Sreeja Konidela ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీ పరిచయం లేని ఈమె తండ్రి హోదా తరపున తెలుగువారికి పరిచయమైంది.
ముఖ్యంగా తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.అప్పుడప్పుడు మెగా కాంపౌండ్ కి సంబంధించిన పలు ఈవెంట్లలో పాల్గొనడం వల్ల అందరి దృష్టిలో పడుతుంది.
ఇక గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది శ్రీజ.ఆ సమయంలో చిరంజీవి ఫ్యామిలీ పరువు మొత్తం పోవడమే కాకుండా.చిరంజీవి పెంపకం పై కూడా చాలామంది విమర్శించారు.కూతురిని సరిగ్గా పెంచలేనివాడని రకరకాలుగా విమర్శలు చేశారు.
ఇక చివరికి చిరంజీవి చేసేదేమీ లేక తన కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు.

బయట జనాలు మాటలు పట్టించుకోకుండా తన కూతురిని మళ్లీ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నాడు.శ్రీజకు మొదటి భర్తతో ఒక కూతురు కూడా పుట్టింది.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది.
తర్వాత కొంతకాలానికి చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో( Kalyan Dev ) రెండో పెళ్లి చేయించాడు.ఇక రెండవ భర్తతో కూడా ఒక కూతురుని కన్నది శ్రీజ.

ఇక కళ్యాణ్ ను కూడా హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు.అంతేకాకుండా శ్రీజ తో కూడా అతడికి విభేదాలు వచ్చాయని.దీంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు అని ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి.ఇక కళ్యాణ్ కూడా మెగా ఫ్యామిలీలో ఎక్కడ కనిపించకపోవడంతో నిజంగానే వీరి మధ్య విడాకులు జరిగాయని కన్ఫామ్ చేశారు జనాలు.

అలా మరోసారి శ్రీజ తన లైఫ్ ను పాడు చేసుకుంది.ఇక బయట జనాలు ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోకుండా తన పిల్లలతో సంతోషంగా గడుపుతుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.
ఎప్పటికప్పుడు బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.తన కూతుర్ల ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తుంది.
అంతే కాకుండా తన కూతుర్లతో చేసిన డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా తన తండ్రి తరపున ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తన చిన్న కూతురిని ఎత్తుకొని వర్క్ అవుట్ చేస్తే కనిపించింది.ఇక ఆ వీడియో చూసిన జనాలు కొందరు ఈ వయసులో కూడా ఆమె ఎనర్జీని చూసి మురిసిపోతున్నారు.కానీ హెటర్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఓ నెటిజన్.శ్రీజ చాలా అదృష్టవంతురాలు.
తండ్రి సంపాదనతో బాగా ఎంజాయ్ చేస్తుంది అని కామెంట్ చేయగా మిగతా నెటిజన్స్.ఇక తండ్రి సంపాదన మీదనే ఆధారపడి ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.