రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన చంద్రబాబు అరెస్ట్( Chandrababu Arrest ) తదనంతర పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినప్పటికీ ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకూ పెదవి ఇప్పలేదు .నిజానికి ఇలాంటి సందర్భంలో ఏ ముఖ్యమంత్రి అయినా తాము ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదని చట్టం తన నియమాల ప్రకారం తాను నడుస్తుందని, అవినీతి చేశారు కాబట్టి దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం పై సిఐడి చట్టప్రకారం ముందుకు వెళ్తుంది అన్న ప్రకటన జగన్ నుంచి వస్తుందని చాలామంది ఊహించారు.
అయితే అసలు ఇది తనకు సంబంధమే లేని వ్యవహారం అన్నట్లుగా ఆయన తన పని తాను చేసుకో పోతున్నారు.అయితే మరి కొన్ని రోజుల్లో ఈ విషయం పై మాట్లాడక తప్పని పరిస్థితి జగన్ కు ఎదురవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

త్వరలోనే ఒక బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు.తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో( Nidadhavolu ) కాపు నేస్తం నిధుల విడుదల సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు .దాంతో ఆ సభలో జగన్ తన మనసు విప్పుతారని చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు మరియు రెండు పార్టీల పొత్తులపై తనదైన విమర్శలు చేస్తారని ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా తన వెనుక జగన్ జనం ఉన్నారని జగన్ గట్టిగా సౌండ్ చేయబోతున్నారని వైసీపీ శ్రేణులు( YCP ) ఎదురుచూస్తున్నాయి.ఇప్పటికే తమ నాయకుడు జగన్ సింహం లాంటివాడని,ఎలాంటి పొత్తులూ లేకుండా సింగిల్గానే వస్తారని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు.నిడదవోలు సభలో జగన్ కూడా తెలుగుదేశం జనసేన పార్టీల వైఖరిను తీవ్రస్థాయిలో ఎండగడతారని,

తాము చట్టానికి అతీతం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం వ్యవహార శైలిని( TDP ) తీవ్ర స్తాయిలో దునుమాడి తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామన్న క్లారిటీని ప్రజలకు జగన్ వివరించబోతున్నట్టుగా వైసిపి వర్గాలు అంటున్నాయి.మరి ఎంతమంది కలిసి వచ్చినా తమదే విజయం అన్న ధీమాను ఈ బహిరంగ సభ సాక్షిగా జగన్ ప్రదర్శించబోతున్నారని పొత్తు పరిణామాలపై కొంత అభద్రతాభావంతో ఉన్న వైసీపీ శ్రేణులకు జగన్ తన వ్యాఖ్యల ద్వారా మనో ధైర్యాన్ని తీసుకువస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరి ఇప్పుడు జగన్ ఫస్ట్ రియాక్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుంది అని చెప్పవచ్చు
.