చాలా మందికి అండర్ ఆర్మ్స్ డార్క్( Dark Underarms ) గా, అందవిహీనంగా ఉంటాయి.బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, మాయిశ్చరైజర్ ను ఎవైడ్ చేయడం, చెమట, శరీరంలో అధిక వేడి తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి.
ఇటువంటి అండర్ ఆర్మ్స్ ఉన్నవారు స్లీవ్ లెస్ దుస్తులను వేసుకునేందుకు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ లో నలుపును వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ( Underarms Remedy ) అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే వారం రోజుల్లో మీ డార్క్ అండర్ ఆర్మ్స్ వైట్ గా, స్మూత్ గా మారతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని.
స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని అండర్ ఆర్మ్స్ ను కనీసం ఐదు నిమిషాల పాటు బాగా రబ్ చేయాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అండర్ ఆర్మ్స్ లో నలుపు మొత్తం మాయం అవుతుంది.కొద్ది రోజుల్లోనే డార్క్ అండర్ ఆర్మ్స్ వైట్ గా మరియు స్మూత్ గా( White and Smooth Underarms ) మారతాయి.
కాబట్టి డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.