ముందస్తు ఎలక్షన్స్.. టూ మచ్ కన్ఫ్యూజన్ !

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది.

 Early Elections Too Much Confusion, Kottu Satyanarayana, Ys Jagan Mohan Redd,-TeluguStop.com

గత కొన్నాళ్లుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ ఏడాది జరిగే తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతాయని, వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు( YS Jagan Mohan Reddy ) వెళ్ళే అవకాశం ఉందని, టీడీపీ జనసేన పార్టీలు( Jana sena ) మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నాయి.

అందుకే ఆ పార్టీలు ఇప్పటికే ఎలక్షన్స్ మూడ్ లోకి వచ్చేశాయి.అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చింది.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Ys Jagan, Ysjagan-Politics

కానీ ఇప్పుడు జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం కాయమైపోయింది. మంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) మాట్లాడుతూ.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చని చెప్పడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కయి.ఇన్నాళ్ళు ముందస్తు ఎన్నికల విషయంలో వెనకడుగు వేసిన జగన్ సర్కార్ ఇప్పుడు సడన్ గా ముందస్తు ఎలక్షన్స్ పై ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తుండడంతో ఆ బిల్లు సక్సస్ అయితే ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే వచ్చిన ఆశ్చర్యం లేదు.

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Ys Jagan, Ysjagan-Politics

అందుకే ముందస్తు ఎన్నికలు జరగవచ్చని స్వయంగా జగన్ ప్రభుత్వమే క్లారిటీ ఇస్తోంది.దీంతో ఎలక్షన్స్ పై గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడిందనే చెప్పాలి.అయితే ఒకవేళ కేంద్రం జమిలి ఎలక్షన్స్ అమలు చేస్తే పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని గతంలో కేంద్ర పెద్దలు క్లారిటీ ఇచ్చారు.

ఆ రకంగా చూస్తే వచ్చే ఏడాది మే లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరుగుతాయి.మరి జగన్ సర్కార్ జనవరి లేదా ఫిబ్రవరి లో ఎలక్షన్స్ జగవచ్చని ఎందుకు చెబుతోంది అనే దానిపై క్లారిటీ లేదు.

మొత్తానికి ముందుస్తు ఎన్నికలైతే రావడం పక్కా అని విషయం స్పష్టమౌతోంది.మరి ఈసారి ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube