ఫైనల్ స్టెప్.. షర్మిల ఏం చేయబోతుంది ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు దారులు వేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే హస్తం హైకమాండ్ తో పలుమార్లు చర్చలు కూడా జరిపారామే.

 The Final Step.. What Is Sharmila Going To Do , Ys Sharmila , Congrss Party ,-TeluguStop.com

అయితే హైకమాండ్ ముందు షర్మిల ఉంచుతున్న డిమాండ్ల కారణంగానే విలీనం ఆలస్యం అవుతోందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.ఆమె టి కాంగ్రెస్ లోనే కొనసాగాలని అలాగే తన పార్టీకి చెందిన వారికి 20 సీట్లు కేటాయించాలని, ఆమెకు పాలేరు నియోజిక వర్గం సీటు కేటాయించాలని,.ఇలా పలు రకాల డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచిందట.

Telugu Congrss, Dk Shivakumar, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ys Sharmi

అయితే టి కాంగ్రెస్ లో షర్మిల రాకను కొంతమంది స్వాగతిస్తుంటే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఆమె టి కాంగ్రెస్ కు అవసరం లేదని ఆంధ్ర కాంగ్రెస్ లో ఆమె చేరితే తమకెలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.దానికి తోడు ఆమె డిమాండ్ చేస్తున్న పాలేరు నియోజిక వర్గంపై తీవ్రమైన పోటీ నెలకొంది.

ఇప్పటికే అక్కడి నుంచి పోటీ చేసేందుకు తుమ్మల గట్టిగా ప్రయాతినిస్తున్నారు.అంతే కాకుండా రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి 20 సీట్లు కేటాయించడానికి కూడా ససేమిరా అంటున్నారట టి కాంగ్రెస్ నేతలు.

Telugu Congrss, Dk Shivakumar, Rahul Gandhi, Revanth Reddy, Telangana, Ys Sharmi

దీంతో ఈ అడ్డంకులన్నిటిని దాటుకునేందుకు డికె శివకుమార్ ( DK Shivakumar )ద్వారా క్లియర్ చేసే పనిలో ఉన్నారు షర్మిల.ఇప్పటికె డికె ద్వారా అధిష్టానంతో పలు మార్లు బేటీ అయ్యారు కూడా.ప్రస్తుతం టి కాంగ్రెస్ వ్యవహారాలను డికె శివకుమారే చూసుకుంటున్నారు.దీంతో మరోసారి తన డిమాండ్లను అధిష్టానం ముందు ఉంచడానికి డీకే శివకుమార్ తో పాటు నేడు సోనియా, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు షర్మిల.

ఈ బేటీలో పార్టీ విలీనంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.ఒకవేళ షర్మిల డిమాండ్లకు హస్తం హైకమాండ్ ఒకే చెబితే.

ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉండనుంది అనేది అత్యంతా ఆసక్తికరంగా మారింది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube