శంకర్ డైరెక్షన్ లో వచ్చిన శివాజీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది.రజినీకాంత్ నట విశ్వ రూపాన్ని చూపించిన సినిమా ఇది… ఇందులో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో అయిన సుమన్ చేయడం విశేషం అనే చెప్పాలి సుమన్ అంటే అందరికీ ఒక సాప్ట్ కార్నర్ ఉంటుంది ఆయన చేసిన పాత్రలు కూడా అలాంటివే అయితే శంకర్ తన సినిమా కి విలన్ కావాలి అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారు అని చాలా మంది పేర్లు పరిశీలించి చివరగా సుమన్ ని తీసుకున్నారు సుమన్ అయితే అప్పటి వరకు ఎప్పుడు కూడా విలన్ గా చేయలేదు అందుకే సుమన్ ని విలన్ గా పెడితేనే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అని భావించి ఆయన్ని తీసుకున్నారట.ఈ సినిమాలో విలన్ గా సుమన్ నటన అద్భుతం అనే చెప్పాలి…
శంకర్ డైరెక్షన్ ఈ సినిమా కి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.సుమన్ అయితేనే ఈ క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ యాప్ట్ అని నమ్మిన శంకర్ నమ్మకాన్ని సుమన్ హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టారనే చెప్పాలి ఈ విషయాన్ని శంకర్ చాలా సార్లు చెప్పారు…విలన్ గా సుమన్ కూడా అసలు ఎవరు ఊహించని విధంగా తన నటన తో అందరినీ ఆకట్టుకున్నాడు…
ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు ఈ సారి శంకర్ భారీ హిట్టు కొట్టడమే లక్ష్యం గా ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తుంది… సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు…