జూనియర్ ఐశ్వర్యారాయ్ స్నేహ ఉల్లాల్.. ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొంతమంది హీరోయిన్లు చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 Why Sneha Ullal Is Not Getting Offers Sneha Ullal, Tollywood, Current Movie , Sr-TeluguStop.com

ఈ అలాంటి హీరోయిన్లలో స్నేహ ఉల్లాల్ కూడా ఒక్కరు.ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

దీంతో ఇక ఈ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ అంటూ సొంత పేరుతో పిలిచే అభిమానుల కంటే జూనియర్ ఐశ్వర్యరాయ్ అంటు పిలిచే అభిమానుల ఎక్కువైపోయారు.

అంతలా తన కళ్ళతో మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు అందుకున్న ఈ సొగసరి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని విధంగా చిత్ర పరిశ్రమలో కనుమరుగయింది.ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత అక్కినేని హీరో శ్రీశాంత్ సరసన కరెంట్ సినిమాలో నటించి యూత్ కు బాగా దగ్గరైంది.ఆ తర్వాత బాలయ్య హీరోగా తెరకెక్కిన సింహ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది స్నేహ ఉల్లాల్.

Telugu Balakrishna, Simha, Sneha Ullal, Srishanth, Tollywood-Latest News - Telug

అయితే ఇక అకస్మాత్తుగా స్నేహఉల్లాల్ సినిమాలకు దూరం అవడానికి కారణం ఏంటి అన్న విషయంపై మాత్రం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.అయితే కొన్ని అనారోగ్య సమస్యల కారణంగానే స్నేహాఉల్లాల్ చిత్ర పరిశ్రమకు దూరంగా అయ్యిందట.ఈ హీరోయిన్ చిన్నప్పటి నుంచి రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉందట.దీనినే ఇమ్యూన్ డిసీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎక్కువసేపు నిలబడలేరు ఒకే చోట కుదురుగా ఉండలేరు.ఇక వ్యాధి ఎక్కువవడంతో రెస్ట్ కావాలని వైద్యులు చెప్పారట.

దీంతో ఇలాంటి సమస్యతో బాధ పడుతుంది కాబట్టే చివరికి సినిమాలకు దూరం అయ్యిందట స్నేహ ఉల్లాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube