దేవి శ్రీ ప్రసాద్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెబితే చాలు ఒకప్పుడు ప్రేక్షకులందరూ లేచి డ్యాన్సులు చేసేవారు.
ఎందుకంటే ఇతగాడు కంపోజ్ చేసే పాటలు ఆ రేంజిలో ఉండేవి.ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాకు పని చేసినా ఆ సినిమా లో మ్యూజిక్ తోనే సినిమా హిట్ అయ్యేది అని చెప్పాలి.
అంతలా ఇతని మ్యాజిక్ పని చేసింది.ఇక సౌత్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు దేవిశ్రీప్రసాద్.
కానీ ఇప్పుడు మాత్రం దేవిశ్రీ పని అయిపోయిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి అని చెప్పాలీ.
ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా తెర మీదికి వచ్చిన ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చాన్స్ దక్కించుకున్నాడు.
అందులో తప్పేమీ లేదు.థమన్ తనను తాను నిరూపించుకుంటూ అంతలా సక్సెస్ అవుతున్నాడు.
అద్భుతమైన ఆల్బమ్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.ఇక థమన్ ఉంటే మంచి మ్యూజిక్ ఉంటుందని ప్రేక్షకులలో కూడా భావన కలిగించాడు దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకులు కావాలి అనుకుంటున్నా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తన సినిమాల్లో పెట్టుకుంటున్నారు.
ఇలా థమన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంటే నెంబర్ వన్ స్థానంలో ఉన్న దేవిశ్రీ క్రేజ్ మాత్రం ఒక్కో మెట్టు పడిపోతూ వస్తోంది.
మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ అందించి మరోసారి హిట్ అందుకున్నాడు.

ఈ సినిమాతో గాడిలోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు.కానీప్రస్తుతం క్రేజ్ తగ్గిపోతున్న కొద్దీ ప్రస్టేషన్ లో కాపీ ట్యూన్ తో ప్రేక్షకులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఉప్పెన సినిమా లోని జల జల జల పాతం పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఇప్పుడూ ఇదే ట్యూన్ మక్కికి మక్కి దింపేసాడు.
లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో జల జల జల పాతం ట్యూన్ కీ దడ దడ అనే ఒక లిరిక్స్ మార్చాడు.ఇక ఇది చూసి అయ్యో పాపం దేవిశ్రీప్రసాద్ ప్రస్టేషన్ పీక్స్ కి వెళ్తున్నట్టు ఉంది అందుకే క్రియేటివిటీ లోపిస్తుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.