Gaiola Island Italy : ఇటలీలోని ఈ ద్వీపం శాపగ్రస్తమైనదని ఎందుకంటారు..?

ఈ ప్రపంచంలో ఎన్నో వింత విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి.కొన్ని ప్రదేశాలు అందాలతో ఆకట్టుకుంటే మరికొన్ని ప్రదేశాలు భయంకరమైన చరిత్రలతో అందరికీ హడలు పుట్టిస్తుంటాయి.

 Why Is This Island In Italy Called Cursed Gaiola Island-TeluguStop.com

ఇలాంటి వాటిలో గయోలా ద్వీపం ఒకటి.ఇటలీలోని నేపుల్స్ సమీపంలో ఉన్న ఈ చిన్న ద్వీపం చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది.

ద్వీపం నుంచి అందమైన సముద్రం చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు, ఈ ద్వీపం పైన ఒక విల్లా కూడా ఉంది.అయితే వీటన్నిటి వెనక ఈ ద్వీపం లో ఏదో చెడు దాగి ఉంది.

చాలా మంది ఈ ద్వీపం శాపగ్రస్తమైందని అనుకుంటారు.ఈ ద్వీపాన్ని కలిగి ఉన్న ఎవరికైనా చెడు జరుగుతుందని విశ్వసిస్తున్నారు.

దానికి కారణాలు లేకపోలేదు.గయోలా ద్వీపం( Gaiola Island )మొదటి యజమాని లుయిగి నెగ్రీ 1800ల చివరలో ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.

విల్లాను నిర్మించాడు కానీ వెంటనే అతను తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు.ఈ ద్వీపాన్ని కొనుగోలు చేయాలనుకున్న తదుపరి వ్యక్తి గ్యాస్పేర్ అల్బెంగా.

అతను ఓ ఓడకు కెప్టెన్.అయితే ఈ ద్వీపం కొనుగోలు చేశాక అతడు 1911లో ఓడ ప్రమాదంలో మరణించాడు.ఆపై ఈ దీవిని స్విట్జర్లాండ్‌కు చెందిన హన్స్ బ్రాన్ అనే ధనవంతుడు కొనుగోలు చేశాడు.1920 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.అతని భార్య కూడా మరణించింది.ఆమె సముద్రంలో మునిగిపోయింది.

Telugu Gaiola Island, Italy, Naples, Nri, Ownership, Tragic, Underwater Park-Tel

ఆ తర్వాత మారిస్-వైవ్స్ సాండోజ్ అనే వైద్యం చేసే వ్యాపారవేత్త 1930 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.కానీ అతను 1958లో స్విట్జర్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్నాడు.ద్వీపం యొక్క తదుపరి యజమాని బారన్ కార్ల్ పాల్ లాంగ్‌హీమ్ ఓ ఉక్కు తయారు చేసే వ్యాపారవేత్త.అతను 1950 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.

కానీ అతని వ్యాపారం విఫలమైంది, అతను ద్వీపాన్ని విక్రయించవలసి వచ్చింది.ఆపై ఈ ద్వీపాన్ని జియాని అగ్నెల్లికి విక్రయించారు.

అతను కార్లు తయారు చేసే వ్యాపారవేత్త.అతను 1960 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.

కానీ అతని కుటుంబానికి చాలా సమస్యలు ఉన్నాయి.అతని సోదరుడు 1997లో క్యాన్సర్‌తో మరణించాడు.

Telugu Gaiola Island, Italy, Naples, Nri, Ownership, Tragic, Underwater Park-Tel

ఆ తర్వాత ఈ ద్వీపాన్ని J.పాల్( J Paul ) గెట్టి కొనుగోలు చేశారు.అతను అమెరికన్‌ ధనవంతుడు.1970 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసిన కొంతకాలానికే అతని చిన్న కుమారుడు ట్యూమర్‌తో చనిపోయాడు.పెద్ద కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.అతని రెండో భార్య డ్రగ్స్‌తో చనిపోయింది.అతని మేనల్లుడు కిడ్నాప్ కి గురైయ్యాడు.అతడిని విడిపించడానికి చాలా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.

ద్వీపం చివరి యజమాని జియాన్‌పాస్క్వెల్ గ్రాప్పోన్.ఆయన బీమా విక్రయించే వ్యాపారవేత్త.1970 లలో ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.అప్పులు తీర్చకపోవడంతో జైలుకు వెళ్లాడు.

అతని భార్య కూడా కారు ప్రమాదంలో మరణించింది.ఆ విధంగా చాలామంది ప్రాణాలను ఈ ద్వీపం పట్టణ పెట్టుకుందని ప్రజలు నమ్ముతారు.1978లో ఇటలీ( Italy ) ప్రభుత్వం ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ ద్వీపం ఇప్పుడు అండర్‌వాటర్ పార్కులో భాగం.

ఈ పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.ఇది సముద్రం గురించి అధ్యయనం చేయడానికి, బోధించడానికి ఉపయోగించబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube