ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ( Volunteers in AP ) వ్యవహారంపై రాజకీయంగా రచ్చ జరుగుతుంది.వాలంటీర్లు అందిస్తున్న అన్నిరకాల సేవలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని, వారికి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది.అయితే ఈ ఆదేశాలు వెలువడడం వెనుక టిడిపికి( TDP ) చెందిన కొంతమంది పిటిషన్లు వేయడమే కారణం అనే విషయం అందరికీ అర్ధమైంది.
వాలంటీర్లను చూసి విపక్ష పార్టీలన్నీ బెదిరిపోతున్నాయని, వారి ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా మళ్లీ వైసిపి వైపే మొగ్గు చూపుతారనే భయం విపక్ష పార్టీల్లో ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాలంటీర్లు గత నాలుగేళ్ల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను అందించడమే కాకుండా, పథకాలతో పాటు లబ్ధిదారుల ఎంపిక వివిధ రకాలైన సర్టిఫికెట్లు ఇంటికి తెచ్చి మరీ అందించడం వంటివి జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.ప్రభుత్వం కార్యాలయాలు చుట్టూ వివిధ పనుల నిమిత్తం తాము తిరగాల్సిన పని లేకుండా అన్ని పనులు ఇంటి వద్ద నుంచే వాలంటీర్ల ద్వారా జరిగిపోతుండడం వంటివి జనాల్లోకి బాగా వెళ్లాయి.
ముఖ్యంగా కరోనా వంటి సమయంలోనూ వాలంటీర్ సేవల పై ప్రశంసలు అందాయి.ఇక ప్రతి నెల ఒకటో తారీకు తెల్లవారుజామునే వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్లు నేరుగా వారికి అందించడం వంటివి జనాలను బాగా మెర్పించింది.
ఒక రకంగా చెప్పాలంటే జనాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తూ వస్తున్నారు.ఇక వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీని రోల్ మోడల్ గా తీసుకుని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు అనేక రాష్ట్రాలు మొగ్గు చూపించాయి.తెలంగాణలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వంటివి చోటుచేసుకున్నాయి.అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ఎన్నికల్లో తమకు ముప్పు తెస్తుందనే భయం విపక్ష పార్టీలకు ఉంది.
కానీ జనాలు ఈ వాలంటరీ వ్యవస్థకు బాగా కనెక్ట్ అవడంతో, వారికి వ్యతిరేకంగా ఏ విమర్శలు చేసినా అది తమకు ముప్పు చేస్తుందనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు.అందుకే టిడిపి కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయమని చెబుతున్నారు.
అంతేకాదు ప్రతి వాలంటీర్ కు నెలకు 50,000 సంపాదించుకునే విధంగా తాను అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పడం వంటి వ్యాఖ్యలతో చంద్రబాబు నువ్వుల పాలయ్యారు.ప్రస్తుతం వ్యవహారం చూసుకుంటే సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం, విపక్ష పార్టీలకు ముప్పు తెచ్చే విధంగానే కనిపిస్తోంది.అసలే ఇది ఎండాకాలం కావడం, పింఛన్ల కోసం వివిధ పనులు నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం అంటే లబ్ధిదారులకు ఇబ్బంది.ఎందుకంటే ఇప్పటివరకు ఇంటి కే అన్ని సర్వీస్ లు అందుతూ వస్తూ ఉండడంతో ఆ విధానానికి జనాలంతా అలవాటు పడిపోయారు.
కానీ ఇప్పుడు చిన్న చిన్న పనులకు ఆఫీసు చుట్టూ తిరగాల్సి రావడం వంటి వ్యవహారాలన్నీ విపక్ష పార్టీల కారణంగానే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళితే అది ఆయా పార్టీలకు ఎన్నికల్లో ముప్పు తెచ్చినట్లే .