జనసేన ఎందుకు పెట్టారు .. ఏం ఆశించి పెట్టారు ? పవన్ పై పోతిన మహేష్ ఫైర్ 

జనసేన( Janasena ) పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్( potina Mahesh ) పార్టీకి , పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాజీనామా తరువాత మీడియా సమావేశం నిర్వహించిన మహేష్ పవన్ పై సంచలన విమర్శలు చేశారు.

 Why Did The Janasena Come And What Did They Expect Mahesh Fire On Pawan, Jagan,-TeluguStop.com

ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు పవన్ కు వేశారు.  ఆవేశంలోనో,  సీటు రాలేదనో జనసేన పార్టీకి రాజీనామా చేయలేదని,  భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని , పవన్ ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని మహేష్ విమర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కు అనేక ప్రశ్నలు సంధించారు.  రాష్ట్ర ప్రజలకు,  కాపు యువతకు నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి.

పవన్ కళ్యాణ్ నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలి.  మేడిపండు చూడ మేలిమై ఉండు,  పొట్ట విప్పి చూడ పురుగులుండు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ .స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్లు ప్రయాణం చేసినందుకు మా మీద మాకు అసహ్యం వేస్తుంది.  పార్టీ నిర్మాణం , కేడర్ పై పవన్ దృష్టి సారించలేదు.

అన్ని తాత్కాలికం.అంతా నటన .

Telugu Jagan, Janansenani, Pavan Kalyan, Pothina Mahesh, Pothinamahesh, Sujana C

నట్టేట మునిగిపోయాం.ప్రజలు జనసైనికులు కంటే తెలివైన వారు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం , ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు.  25 కేజీల బియ్యం కాదు,  25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో ఎందుకు పోటీ చేయలేకపోయారని మహేష్ ప్రశ్నించారు.25 రోజుల తర్వాత పార్టీ భవిష్యత్ చెప్పగలరా అని ప్రశ్నించారు.21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు జనసేనకి ఏం భవిష్యత్తు ఇవ్వగలరు ?  పవన్ స్వార్థానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి.  పార్టీలో మీకు తెలియకుండా అన్ని జరుగుతున్నాయని భ్రమపడ్డాం.కానీ అన్ని మీకు తెలిసే జరుగుతున్నాయి.పవన్ కళ్యాణ్ చూపులో ద్వంద అర్ధాలు ఉన్నాయి.  సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకి కేటాయించారు.

  గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా అని మహేష్ ప్రశ్నించారు.జనసేన ఎందుకు పెట్టారు ?  ఏం ఆశించి పెట్టారు ?  అసలు జనసేన ఎవరికోసం పెట్టారు ?  పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది .

Telugu Jagan, Janansenani, Pavan Kalyan, Pothina Mahesh, Pothinamahesh, Sujana C

అన్ని ఆధారాలను బయటపెడతాను.  కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్థిస్తున్నా,  మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది .మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే .మీరు ఆస్తులు కొనుక్కున్నారు.  మా రక్త మాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు.  కాకినాడ మేయర్ సరోజ , శేషకుమారి ( Mayor Saroja, Seshakumari ) విశాఖలో మహిళ నాయకురాలికి మాత్రమే పదవులు పొడగించారు .మీ గురించి , పార్టీలో బ్రోకర్ పనులు బయటపెడతారనే భయంతోనే వాళ్ళ పదవులు తొలగించారు.  సృజనా చౌదరి గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు.

అలాంటి సృజనకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు.సృజన గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకున్నారు.

కన్నతల్లిని విమర్శించి,  పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు.ఇంకా అనేక అంశాలకు సంబంధించి పవన్ ను ప్రశ్నిస్తూ వాటికి సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube