సినిమా అంటే అంతే! ఫ్యామిలీ స్టార్ దర్శకుడి పని ఇక అయిపోయినట్టేనా?

సినిమా అనేది రంగు రంగుల ప్రపంచం.అవును, దూరం నుండి చూసేవారికి అదొక భూతల స్వర్గం.

 Director Parasuram Career In Danger ,parasuram,naga Chaitanya,dil Raju,vijay Dev-TeluguStop.com

కానీ అందులోని సాధక బాధలు అనేవి అనుభవించిన వారికే తెలుస్తోంది.డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కొని సినిమా చూసే ప్రేక్షకుడికి సినిమా కేవలం రెండు గంటల షో.కానీ ఒక దర్శకుడికి మాత్రం అదే తన జీవితం.సినిమా ఆడితే తన జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలు… అదే సినిమా పోతే మాత్రం దినదిన గండమే మరి.అందుకే చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు అనేది వందకి ఒక్క శాతమే ఉంటుంది.విషయం ఏమిటంటే… రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ( Rowdy Hero Vijay Deverakonda ) నటించిన ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా విడుదలైన రోజే ప్లాప్ టాక్ తెచ్చుకుని కుదేలయింది.

దాంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.కనీస వసూళ్లు కూడా ఈ సినిమా రాబట్టు కోవడం లేదని టాక్ వినబడుతోంది.

Telugu Dil Raju, Parasuramcareer, Naga Chaitanya, Parasuram, Tollywood-Movie

ఈ క్రమంలో ఏకంగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు( Producer Dil Raju ) రంగంలో దిగి మీడియా ముందుకి వచ్చి మరీ సినిమాని ఎలాగన్నా ఆడించాలని చాలా తాపత్రయ పడుతున్నాడు.ఈ క్రమంలో అయన మాట్లాడుతూ… మౌత్ టాక్ బాగుంది, సినిమాని అందరూ అభినందిస్తున్నారు, కానీ మీడియాలోనే కావాలని కొందరు నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసారు.ఇక నిర్మాత కష్టాన్ని, నష్టాన్ని పక్కన బెడితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవలసింది ఈ సినిమా దర్శకుడు పరశురామ్( Director Parasuram ) గురించి.అవును, ఫ్యామిలీ స్టార్ సినిమా దర్శకుడు పరుశురాం నిజానికి నాగ చైతన్యతో అల్లు అరవింద్‌కు ఒక సినిమా చేయాల్సి ఉంది.

ఈ గ్యాప్ లో హఠాత్తుగా దిల్ రాజు క్యాంపులో చేరి, విజయ్ దేవర కొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాకు మనోడు కమిటయ్యాడు.


Telugu Dil Raju, Parasuramcareer, Naga Chaitanya, Parasuram, Tollywood-Movie

అయితే ఇప్పుడు ఆ సినిమా కాస్త ఫ్లాపు కావడంతో నాగచైతన్య( Naga Chaitanya ), మెగా అభిమానులు ‘మంచిగైంది’ అని దర్శకుడిని వెక్కిరిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారట.నిజానికి ఇక్కడ దిల్ రాజు కి వచ్చిన నష్టం పెద్ద ఉండదు.ఆయన నిర్మాతగా పెద్ద పెద్ద హిట్లు కొట్టి దండిగా సంపాదించాడు.

ఇపుడు ఒకటి ఆరా ప్లాపులు ఆయన్ని ఏమీ చేయలేవు.ఈ సినిమా కాకపోతే మరొక సినిమాతో మనోడు హిట్టు కొట్టి ఖాళీని పురిస్తాడు.

ఇక ఎటొచ్చి దర్శకుడి పరశురామ్ పరిస్థితి ఏమిటో? అని సినిమా పండితులు గుసగుసలాడుకుంటున్నారు.ఎందుకంటే ఇక్కడ కాకలు తిరిగిన దర్శకులే ఇపుడు సినిమాలు లేక కుదేలయ్యారు మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube