అమెరికా( America )లో జరుగుతున్న వరుస దోపిడీ ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.వీటిలో భారతీయులు, భారత సంతతికి చెందిన వారు బాధితులుగా మారుతున్నారు.
అమెరికాలో విలాసవంతమైన ఇళ్లు, వ్యక్తులే టార్గెట్‌గా ఈ ఘటనలు జరుగుతున్నాయి.ప్రాసిక్యూటర్లు చెబుతున్న దాని ప్రకారం.
అమెరికాలో జరుగుతున్న దొంగతనం ఘటనల వెనుక ‘‘దొంగ టూరిస్టులు’’ అని పిలవబడే వ్యక్తులే కారణం.ఈ నేరస్తులు తరచుగా దక్షిణ అమెరికా( South America ) దేశాల నుంచి పర్యాటకుల ముసుగులో అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.
అయితే సంపన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వీరు అధునాతన దోపిడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.కరోల్, జెఫ్ స్టార్‌ల కేసును ప్రస్తావించింది.వీరు దక్షిణ కాలిఫోర్నియా( Southern California )లోని తమ ఇంట్లో దొంగతనానికి గురయ్యారు.
కరోల్‌కు దివంగత తల్లి నుంచి వచ్చిన వారసత్వ వస్తువులతో సహా 8 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని ప్రాసిక్యూటర్లు ఈ చోరీ రింగ్‌ను వెలుగులోకి తెచ్చారు.
టార్గెట్ చేసిన నివాసాల వద్ద వీరు సూట్‌కేసులతో వేచి వుంటారు.అనంతరం పై అంతస్తుల్లో విండో సెన్సార్లు, మోషన్ డిటెక్లర్లు లేకపోవడం వంటి లోపాలను అనువుగా మార్చుకుని దోపిడీలకు పాల్పడుతున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అలాగే సేఫ్టీ అలారం సిస్టమ్‌లు పనిచేయకుండా అడ్డుకోవడానికి వైఫై జామర్‌ల వంటి అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు.దొంగిలించబడిన వస్తువులు త్వరితంగా విక్రయించబడతాయి.
తద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుమానితుల స్వదేశాలకు, ప్రధానంగా చిలీకి పంపబడుతోంది.ఈ నేరాల ప్రాబల్యం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది.
అరిజోనా, మేరీలాండ్, నార్త్ కరోలినా, న్యూయార్క్ వంటి రాష్ట్రాల నుంచి దొంగతనానికి సంబంధించిన నివేదికలు వెలువడుతున్నాయి.
ఈ నేర కార్యకలాపాలను సులభతరం చేయడంలో వీసా మినహాయింపు కార్యక్రమం పాత్ర గురించి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మినహాయింపులు మంజూరు చేయబడిన వ్యక్తులపై నేపథ్య సమాచారాన్ని పొందడంలో ప్రాసిక్యూషన్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో సవాళ్లను హైలైట్ చేశారు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ ఈ సమస్యను గుర్తించి.
చిలీ అధికారులతో సహకారాన్ని పెంపొందించే ప్రయత్నాలను ఉదహరించింది.అయినప్పటికీ దొంగతనాలను అరికట్టడంలో ఈ చర్యల సమర్థతపై ప్రశ్నలు వేధిస్తూనే వున్నాయి.