అయ్య బాబోయ్: ఐపీఎల్ లో కొత్త ఫ్రాంఛైజీల విలువ అన్ని కోట్లా..?!

బీసీసీఐ కొత్త కొత్త ప్రణాళికలతో టీమిండియాను ఉరకలెత్తిస్తోంది.తాజాగా ఐపీఎల్ లో మరో రెండు ఫ్రాంచైజీలను కొత్తవిగా తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

 Whopping Price For New Ipl Teams 2021, New Franchacise, Viral News, Sports Upda-TeluguStop.com

బీసీసీఐ ఇటువంటి విషయంపై పూర్తిగా నిమగ్నమయ్యింది.జూలై నెలలో ఈ రెండు ఫ్రాంచైజీలకు సంబంధించి ఏర్పాట్లు మొదలు పెట్టింది.

ఫ్రాంచైజీల రేటు చూస్తే షాక్ అయ్యేలా ఉంది.ఈ రెండు ఫ్రాంచైజీలలో ఒక్కో దానిని చూసినట్లైతే కనీస విలువ రూ.2000 కోట్లుగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.సాధారణంగా చూసినట్లైతే ప్రపంచంలోనే అతి భారీ నజరానాతో నడిచేదిగా ఐపీఎల్ చరిత్రకెక్కింది.

ఐపీఎల్ వల్ల ప్రతి సంవత్సరం ఆదాయం అనేేది పెరుగుతూనే వస్తోంది.ఇప్పుడు ఐపీఎల్ లో ప్రతి టీమ్ కూడా పోటాపోటీగా తలపడుతున్నాయి.

మా టీమ్ గెలుస్తుందంటే మా టీమ్ గెలుస్తుందని చాలా మంది పోటీలు పడుతున్నారు.అందుకే ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

ఇప్పుడు ఐపీఎల్ లో 8 టీమ్ లు ఉన్నాయి.

Telugu Ipl, Franchacise, Ups-Latest News - Telugu

ఇకపై జరిగే ఐపీఎల్ లో మరో రెండు టీమ్ లు కూడా అదనంగా చేరనున్నాయి.దీంతో ఐపీఎల్‌ లో మొత్తం 10 జట్లు కాబోతున్నాయి.మొత్తం 10 టీమ్ లతో ఐపీఎల్ ఆడించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయనుంది.

ఐపీఎల్ పై ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండటంతో దానినే బీసీసీఐ క్యాష్ చేసుకునే ఏర్పాట్లలో ఉంది.అందుకే కొత్త ఫ్రాంచైజీలకు ఆహ్వానం పలుకుతోంది.ఆ రెండు జట్లను భారీ ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేసేస్తోంది.ధర ఎంతైనా కూడా కొనడానికి వ్యాపార సంస్థలు అనేవి ముందుకు వస్తున్నాయి.

ఆ రెండు జట్లకు బీసీసీఐ భారీ ధరను నిర్ణయించి చెప్పాయి.ఈ నేపథ్యంలో బిడ్లును బీసీసీఐ ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

జూలై నెలలో టెండర్లు అనేవి పిలవనున్నారు.కొత్తగా వచ్చే ఫ్రాంచైజీ ధర 250 మిలియన్‌ డాలర్లు ఉండేటటువంటి అవకాశం అనేది ఉందని ప్రముఖ సంస్థకు చెందిన సీఈవో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube