టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయిన రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింది.ఈ ఇద్దరు డైరెక్టర్లు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లు కావడం గమనార్హం.
రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తుండగా ఫుల్ రన్ లో ఈ సినిమా 600 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.టికెట్ రేట్లను తగ్గించడంతో ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది.
అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ లలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు రాజమౌళి పేరే సమాధానంగా వినిపిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్1 బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయలేదనే సంగతి తెలిసిందే.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాతో పోల్చి చూస్తే ఎక్కువగా బిజినెస్ జరిగింది.కర్ణాటకలో కేజీఎఫ్ ఛాప్టర్2 హక్కులు ఏకంగా 180 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా.

కేజీఎఫ్ ఛాప్టర్2 బాహుబలి2, ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్2 సినిమాతో రాజమౌళికి సమాన స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కేజీఎఫ్2 రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తే మాత్రం రాజమౌళి, ప్రశాంత్ నీల్ లలో నంబర్ 1 డైరెక్టర్ ఎవరనే చర్చ జరుగుతోంది.

బాహుబలి2 రికార్డులు బ్రేక్ అయ్యేవరకు రాజమౌళికి టాలీవుడ్ లో పోటీనిచ్చే డైరెక్టర్ అయితే లేరు.ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తక్కువ సినిమాలే తెరకెక్కించినా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.
రాజమౌళి, ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న కథలు భిన్నంగా ఉండటం గమనార్హం.