జూనియర్ ఎన్టీయార్ మీద విమర్శలు చేస్తున్నదెవరు..?

జూనియర్ ఎన్టీయార్( jr ntr ) ఎంత మంచి నటుడు అనేది మన అందరికీ తెలిసిందే అయితే ఈయన ఎక్కువ గా కాంట్రవర్సీ లకి వెళ్ళడు.ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు.

 Who Is Criticizing Junior Ntr, Ntr , Koratala Shiva, Chandrababu Naidu, Tarak Ra-TeluguStop.com

అయితే రీసెంట్ గా ఆయన కి ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించినందుకు గాను ఉత్తమ నటుడుగా సైమా అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం ఎన్టీయార్ కొరటాల శివ( Koratala Shiva ) కాంభినేషన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు ఇందులో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది.

ఇక ఎన్టీయార్ సినిమా కెరియర్ బాగున్నప్పటికీ ఆయన మీద రీసెంట్ గా కొన్ని కాంట్రావర్సి లు అనేవి జరుగుతున్నాయి.అవెంటంటే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) గారు రీసెంట్ గా అరెస్ట్ అయినా విషయం మన అందరికి తెలిసిందే.

 Who Is Criticizing Junior NTR, Ntr , Koratala Shiva, Chandrababu Naidu, Tarak Ra-TeluguStop.com

ఆయన అరెస్ట్ అయ్యాక ఆయన్ని కలవడానికి చాలా మంది ప్రముఖులు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్లి ఆయన్ని కలుస్తూ ఉంటె జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఆయన అరెస్ట్ గురించి అసలు ఎలాంటి మాట మాట్లాడలేదు కనీసం తన ట్వీటర్ లో ఒక ట్విట్ కూడా చేయలేదు.దాంతో తెలుగు దేశం కార్య కర్తలు అందరు కూడా ఎన్టీయార్ మీద కోపం తో ఆ ఎన్టీయర్ అనే పేరు తీసి వేసి ని సొంత పేరు పెట్టుకో అంటూ పెద్ద ఎత్తున ఎన్టీయార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలు ఎన్టీయార్ అసలు పేరు ఏంటి ఆయనకి ఎన్టీయార్ అనే పేరు ఎవరు పెట్టారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.

Telugu Chandrababu, Harikrishna, Koratala Shiva, Nandamuritaraka, Tarak Ram-Movi

చిన్నతనం లో చదువుకుంటున్న టైం లో ఒకరోజు తారక్ కి పెద్దాయనని కలవమని ఆయన నుంచి ఒక పిలుపు రావడం తో తారక్ ఏమి ఆలోచించకుండా ఆయన్ని కలవాలని హడావిడి గా ఆయన ఉండే ప్లేస్ కి వెళ్ళాడు.అప్పుడు పెద్దాయన తారక్ ని పిలిచి నీ పేరు ఏంటి అని అడిగితే అప్పుడు తారక్ నా పేరు తారక్ రామ్ ( Tarak Ram )అని చెప్పాడు.దానితో అక్కడే ఉన్న హరికృష్ణ ని పిలిచి వీడి పేరు తారక రామారావు అని పెట్టండి అని చెప్పడం తో అప్పటి నుంచి తారక రామ్ గా ఉన్న ఆయన పేరు నందమూరి తారక రామారావు గా మారింది.

ఇక తారక్ కి వీలు దొరికినప్పుడల్లా పెద్ద ఎన్టీయార్ దగ్గరకి వెళ్లి పెద్దాయనతో ఎక్కువ సేపు గడిపేవారట.ఇక జూనియర్ ఎన్టీయార్ కి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టం, ఆమె అంటే ప్రాణం అని కూడా ఎన్టీయార్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు.

ఇక వాళ్ల నాన్న హరికృష్ణ( Harikrishna ) అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం ఆయన రోడ్ ప్రమాదం లో చనిపోయినపుడు కూడా ఎన్టీయార్ చాలా ఎమోషనల్ అవ్వడం మనం చూసాం.అయితే అప్పటి నుంచి ఎన్టీయార్ ఏ సినిమా ఫంక్షన్ కి వచ్చిన అభిమానులని క్షేమంగా ఇంటికి వెళ్లాలని చెప్తూ ఉంటారు.

Telugu Chandrababu, Harikrishna, Koratala Shiva, Nandamuritaraka, Tarak Ram-Movi

అయితే తారక్ చంద్రబాబు గారి విషయం లో ఎందుకు స్పందించడం లేదు అనేది తెలియాల్సి ఉంది.తారక్ వాళ్ల నాన్న అయిన హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పక్కనే ఉంది అన్ని పనులు చూసుకున్నాడు.చంద్రబాబు నాయుడు కి తారక్ కి మాటలు లేకపోయినా కనీసం వల్ల నాన్న చనిపోయిన టైం లో వెంటే ఉన్నాడు కాబట్టి దానికోసం అయిన ఎన్టీయార్ వెళ్లి చంద్రబాబు ని కలిసి రావాల్సింది అని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube