శనివారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ( Janasena party ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్.
సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు.
నేను సరదాగా మాట్లాడటం లేదు.ఆయనని వైద్యుడికి చూపిస్తే కూడా ఇదే చెబుతారు.
జగన్( jagan ) మానసిక స్థితిని తెలుసుకోవడానికి ఎయిమ్స్ నుంచి మెడికల్ టీంను పంపాలని కేంద్రాన్ని అడగాలని అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతుల్లో పెట్టడం కరెక్ట్ కాదు అని పవన్ వ్యాఖ్యానించారు.
జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు.చనిపోవటానికి సిద్ధపడే పార్టీ పెట్టాను.ప్రజలలో చైతన్యం కలిగించడానికి ధైర్యం నింపడానికి రాజకీయాల్లోకి వచ్చాను.నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను.
మీరే రెచ్చగొడుతున్నారు.జగన్ నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దు.ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు.
అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు భరించగలరా అని ప్రశ్నించారు.ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో( Telugu Desam Party ) పొత్తును ఆమోదించినందుకు జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ తెలుగుదేశం.కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తున్న సమయంలో.ఎవరేమన్నా వ్యక్తిగతంగా తీసుకోకుండా కలిసికట్టుగా అందరూ పనిచేయాలని జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు.