మాజీ మంత్రి కొడాలి నానిపై( Kodali Nani ) టీడీపీ నేత బొండా ఉమ( Bonda Uma ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కొడాలి నానికి ట్రాన్స్ ఫర్ తప్పదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొడాలి నాని సీటు కిందకు నీళ్లు వచ్చాయన్న ఆయన కొడాలి నాని గురించి తెలిసే జగన్( Jagan ) మంత్రి పదవి తీసేశారని విమర్శించారు.ఈ క్రమంలో గుడివాడ సీటు( Gudivada Seat ) నుంచి కొడాలి నానిని తప్పించడం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు.
అదేవిధంగా వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) పోటీ చేయనని పారిపోయారని విమర్శించారు.అనంతరం తమ అధినేత చంద్రబాబు చేసిన సవాల్ పై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంపై సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు కూడా స్పందించడం లేదని తెలిపారు.