లోక్సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో నిరసనగా లోక్సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.
మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలు అందరికీ మార్గనిర్దేశం చేసిందని తెలిపారు.అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు.