స్కాట్లాండ్ యార్డ్ పోలీసుగా విధులు నిర్వర్తించిన కాలంలో డజనుపైగా మహిళలపై హింసాత్మకంగా, క్రూరంగా లైంగిక దాడికి పాల్పడిన సీరియల్ రేపిస్ట్‌కు భారత సంతతికి చెందిన న్యాయమూర్తి మంగళవారం ఏకంగా 36 జీవిత ఖైదులను విధించారు.లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో విచారణకు అధ్యక్షత వహించిన జస్టిస్ పర్మ్‌జిత్ కౌర్ ఈ మేరకు తీర్పును వెలువరించారు.
ఇతని దారుణాలపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన బాధితుల ధైర్యాన్ని ఆమె ప్రశంసించారు.
మీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న మహిళల నుంచి భయంకరమైన ప్రయోజనాన్ని పొందారు.
చాలా మంది మహిళలపై నిర్బయంగా అత్యాచారానికి పాల్పడ్డారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులు ఈ దారుణాన్ని బయటకు చెప్పరని మీరు అనుకున్నారు.
మీరు అధికార హోదాలో వునప్పటికీ ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం విశేషం.
ఈ ఘటనపై యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.కారిక్ నేరాలు పోలీస్ బలగాలపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయన్నారు.ఇతను ఇంతకాలం యూనిఫాం ఎలా ధరించగలిగాడో తెలుసుకోవడం అతి ముఖ్యమని బ్రేవర్‌మాన్ అన్నారు.
అతని బాగోతం బట్టబయలు చేసిన మహిళలను ఆమె అభినందించారు.అయితే న్యాయమూర్తి శిక్ష విధించిన తర్వాత కారిక్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.
దీంతో అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.
కారిక్ 12 మంది మహిళలపై 49 నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు.ఇందులో 24 అత్యాచారాలు, కిడ్నాప్, లైంగిక వేధింపులు, ఉద్దేశపూర్వకంగా జైలులో నిర్బంధించడం వంటి ఆరోపణలు అతనిపై వున్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో గత నెలలో అతనిని మెట్ పోలీస్ విభాగం నుంచి తొలగించారు.2003 నుంచి 2020 వరకు కారిక్ అత్యాచారాలకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.అతను నివసించిన ఇంగ్లాండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రాంతంలోనే ఈ దారుణాలకు పాల్పడ్డాడు.
అవన్నీ కూడా కారిక్ పోలీస్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు జరిగినవే.