ఆకాశపుటంచుల్లో విహరించడం ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా వుంది కదూ.ఐతే అది సాధ్యపడదు అని అనుకుంటున్నారు కదూ.
అయితే ఫ్రెంచ్ స్టార్టప్( French Startup ) చేసిన ఆలోచనతో అది ఇపుడు సాధ్యమే.అవును, ఆ ఊహను నిజం చేసుకునే అవకాశం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది.
దానికోసం హైడ్రోజన్ లేదా హీలియంతో కూడిన ఒక భారీ బెలూన్‌ను స్పేస్ పెర్స్‌స్పెక్టివ్( Space Perspective ) అనే ఫ్రెంచ్ స్టార్టప్ ఒకటి తయారు చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది.
అవును, ఇది దాదాపు 15.5 మైళ్ళు అంటే 25 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణంలోకి ప్రజలను సునాయాసంగా ఎత్తుకొని పోగలదు.అక్కడి నుంచి ప్రపంచాన్ని ఆనందంగా వీక్షించవచ్చు.స్పేస్ పెర్స్‌స్పెక్టివ్ ఇలాంటివాటిని తయారు చేయడం కోసం ‘ఇటుడ్స్ స్పేషియల్స్ (CNES)తో పార్టనర్ షిప్‌ను కూడా కలిగి ఉంది.2025 నాటికి బెలూన్ తరహా అంతరిక్ష విమానాలు లేదా రాకెట్లు ప్రారంభం కావాల్సి ఉండగా, అంతకుముందే అలాంటి ఓ ఐడియాను ఇపుడు ఇంప్లిమెంట్ చేయడం విశేషం.
ఇకపోతే ఈ బెలూన్‌లో ఇద్దరు పైలట్‌లతో పాటు ఆరుగురు వరకు ప్రయాణికులు అంతరిక్ష విహారం చేయొచ్చు.కంపెనీ తన యాక్సెస్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని, వివిధ ఖండాల్లో స్పేస్‌పోర్ట్‌లను ఏర్పాటు చేసి, స్పేస్ టూరిజం( Space Tourism ) అనుభవాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందిప్పుడు.ఇక ఈ బెలూన్‌లో ప్రయాణించేందుకు ఒక వ్యక్తికి 132 డాలర్ల చొప్పున చార్జ్ చేస్తారు.అనే మన ఇండియన్ కరెన్సీలో 10000 రూపాయిల వరకు ఉంటుంది.ఇంకా ఇందులో అంతరిక్షం అంచున భోజనం చేసే అనుభవాన్ని కూడా పొందవచ్చు.