ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!

ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ ( Virat Kohli )అద్భుత ఆటను ప్రదర్శించి సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.46 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్స్ లతో చెలరేగి 82 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి బెంగుళూరు జట్టును గెలిపించాడు.తొలి మ్యాచ్లో ఆఫ్ సెంచరీ కంటే ఎక్కువగా పరుగులు చేసి ఐపీఎల్( IPL ) చరిత్రలో 50 సార్లు.50 అర్థ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.కానీ ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వార్నర్( Delhi Capitals player Warner ) 60 సార్లు.50 అర్థ సెంచరీలు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.ఇక విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మొదటి స్థానంలో.ఐపీఎల్ పరంగా రెండో స్థానంలో ఉన్నాడు.పంజాబ్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ 49 సార్లు.50 అర్థ సెంచరీలు చేశాడు.ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 41 సార్లు.50 అర్థ సెంచరీలు చేశాడు.

 Virat Kohli Created A New Record In Ipl ,virat Kohli ,ipl ,delhi Capitals Player-TeluguStop.com
Telugu Delhi, Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Shikhar Dhawan, Virat K

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 45 అర్థ సెంచరీలు, ఐదు సెంచరీలు చేయడంతో పాటు బెంగుళూరు జట్టు ఓపెన్ గా 3 వేల పరుగులు చేసిన ఆటగాడుగా రికార్డ్ సృష్టించాడు.నిన్న జరిగిన ముంబై- బెంగుళూరు మధ్య మ్యాచ్ను గమనిస్తే ముంబై జట్టులో బ్యాటర్లైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ల ఆట తీరు అభిమానులకు నిరాశ మిగిల్చింది.ఇక బెంగళూరు జట్టులో డుప్లేసిస్, విరాట్ కోహ్లీ లు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 16.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి బెంగళూరు జట్టు విజయం సాధించింది.

Telugu Delhi, Ishan Kishan, Latest Telugu, Rohit Sharma, Shikhar Dhawan, Virat K

ఐపీఎల్ లో జరిగిన ఐదు మ్యాచ్లలో ఆరెంజ్ క్యాప్ రేసులో చెన్నై జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, ముంబై జట్టు ప్లేయర్ తిలక్ వర్మ 84 పరుగులు, విరాట్ కోహ్లీ 82 పరుగులు, కైల్ మేయర్స్ 73 పరుగులు, ఫాఫ్ డు ప్లెసిస్ 73 పరుగులు చేసి టాప్-5 లో ఉన్నారు.ఇక బౌలర్ల విభాగంలో పర్పుల్ క్యాప్ రేసులో లక్నో జట్టు బౌలర్ మార్క్ వుడ్ ఐదు వికెట్లు తీసి మొదటి స్థానంలో, రాజస్థాన్ జట్టు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube